క్రిస్మస్ స్పెషల్ చాక్లెట్ కేక్..

manaarogyam

క్రిష్మస్ అంటే ఎక్కడ లేని తీపి గుర్తుకు వస్తుంది.. కొత్త కొత్త స్వీట్స్ దర్శన మిస్తాయి.ముఖ్యంగా కేకులు.. వీటికి డిమాండ్ పెరగడంతో తయారి దారులు కూడా రేట్లు పెంచుతున్నారు.అవి కూడా కొన్ని సార్లు దొరకవు.. అలాంటి వాళ్ళు ఇంట్లోనే చాక్లెట్ కేకును ఎలా తయారు చేస్తారొ ఇప్పుడు తెలుసుకుందాం..

కావలసిన పదార్థాలు..

గోధుమ పిండి- కప్పు,
కొకొ పౌడర్‌ – ఆరు స్పూన్లు,
బాదం పాలు- పావు కప్పు,
చక్కెర – పావు కప్పు,
ఉప్పు- చిటికెడు,
చల్లని నీళ్లు – కప్పు,
సన్‌ఫ్లవర్‌ నూనె- రెండు స్పూన్లు,
బేకింగ్‌ పౌడర్‌ – స్పూను,
నిమ్మరసం- స్పూను.

తయారి విధానం..

ముందుగా బేకింగ్‌ పాన్‌ లోపల భాగమంతా నూనె రాయాలి. ఓ గిన్నెలో గోధుమ పిండి, ఉప్పు కలిపి పక్కన పెట్టుకోవాలి. మరో గిన్నెలో చక్కెర, నీళ్లు వేసి బాగా కలపాలి. చక్కెర అంతా కరిగాక నూనెను కూడా వేసి మళ్లీ కలపాలి. అందులో నిమ్మరసం వేసుకోవాలి.గోధుమ పిండి, బేకింగ్‌ పౌడర్‌ వేసి అంతా కలియబెట్టాలి. ఈ మిశ్రమాన్ని బేకింగ్‌ పాన్‌లో వేసి ఉడికిస్తే కేక్‌గా మారుతుంది. ఓ చిన్న గిన్నెలో నూనె, బాదం పాలు, చక్కెర వేసి వేడిచేయాలి. ఆ ద్రవాన్ని కేకు చుట్టూ వేస్తే సరి.. ఎంతో రుచికరమైన కేకు రెడీ..

Leave a Comment