కరివేపాకు తో ఇలా చేస్తె చక్కటి ఆరోగ్యం మీ సొంతం..

manaarogyam

Updated on:

కరివేపాకును తీసుకుంటే ఎంత ఆరోగ్యం వుందో అందరికీ తెలిసిందే.. ఎన్నో ఆరోగ్య సమస్యలను దూరం చేసే ఈ ఆకులను కేవలం కూరలో ఫ్లేవర్ కోసం మాత్రమే వాడతారు.. తినడానికి ఎక్కువ మంది ఇష్ట పడరు.. అలాంటి వాళ్ళు కరివేపాకు తో చట్ని ని తయారు చేసుకొని తింటే మంచిది.మరి ఈ చట్ని కి కావలసిన పదార్థాలు, తయారి విధానం గురించి వివరంగా తెలుసుకుందాం..

కావలసినవి..

కరివేపాకు – ఒక కప్పు,
కొబ్బరి తురుము – ఒక కప్పు,
ఆవాలు – ఒక స్పూన్‌,
మినప్పప్పు – ఒక స్పూన్‌,
పచ్చిమిర్చి – రెండు,
నూనె – సరిపడా,
ఉప్పు – తగినంత,
జీలకర్ర – అర స్పూన్‌,
ఎండుమిర్చి – రెండు,
వెల్లుల్లి రెబ్బలు – రెండు,
అల్లం – చిన్నముక్క,
చింతపండు – నిమ్మకాయంత,
వేరుశనగలు – రెండు టేబుల్‌స్పూన్లు
కరివెపాకు-పొపుకు

తయారీ విధానం..
ముందుగా స్టవ్ పై పాన్ పెట్టుకొని కొద్దిగా నూనె వేసి వెల్లుల్లి రెబ్బలు, అల్లం, పచ్చిమిర్చి వేసి వేగించాలి. తరువాత కరివేపాకు వేసి కలుపుకోవాలి. కరివేపాకు క్రిస్ప్‌గా అయ్యే వరకు వేగించుకుని దింపుకోవాలి. చల్లారిన తరువాత మిక్సీ జార్‌లో వేసి, కొబ్బరితురుము, చింతపండు, వేరుశనగలు, తగినంత ఉప్పు వేసి, కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా పట్టుకోవాలి.తర్వాత పోపు పెట్టి సర్వ్ చేసుకుంటే రుచి తో పాటు ఆరోగ్యం కూడా మీ సొంతం అవుతుంది..ఈ చట్ని ని చపాతీ,అన్నం లోకి కూడా బాగుంటుంది..మీరు కూడా ట్రై చెయ్యండి..

Leave a Comment