చుండ్రు సమస్యకు ఆ ప్యాక్ తో చెక్..

manaarogyam

చలికాలంలో ఎన్నో ఆరోగ్య సమస్యలు రావడం కామన్.. ముఖ్యంగా జుట్టు సమస్యలు. తల లోని చర్మం పగలడం వల్ల చుంద్రు సమస్య రావొచ్చు. ఈ సమస్య ఒకసారి వస్తే అంత సులువుగా వదలదు. ఎన్ని రకాల ఫ్యాక్ లను వాడిన పెద్దగా ప్రయోజనం ఉండదు.. కానీ ఇప్పుడు చెప్పే ప్యాక్ తో ఆ సమస్యకు పూర్తిగా చెక్ పెట్టవచ్చు అని నిపుణులు అంటున్నారు. ఆ ప్యాక్ ఏంటో వివరంగా తెలుసుకుందాం..

ఉసిరిపొడి – ఒక టీస్పూన్

వేపాకులు – 5 నుంచి 6

శీకాకాయి పొడి – ఒక టీస్పూన్

మెంతి పొడి – ఒక టీస్పూన్

రీటా పొడి – ఒక టీస్పూన్

నీళ్లు – ఒక కప్పు

తయారి విధానం

రెండు కప్పుల నీటిలో ఉసిరి  పొడి, వేపాకులు,శీకాకాయి పొడి,మెంతి పొడి,రీటా పొడి వేసి పది నిమిషాల పాటు బాగా మరిగించాలి. ఈ నీటిని వడకట్టి తలకు పట్టించి అరగంట తర్వాత తేలికపాటి షాంపూతో తలస్నానము చేయాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తే చుండ్రు సమస్య శాశ్వతంగా వదిలిపోతుంది.. ఈ ప్యాక్ లో చుంద్రు సమస్య ను దూరం చేసే అన్నీ కారకాలు ఉంటాయి. వారానికి రెండు సార్లు ఈ ప్యాక్ వేసుకోవడం చాలా మంచిది.మీరు కూడా ట్రై చెయ్యండి..

Leave a Comment