బియ్యంతో అందాన్ని పెంచుకోండిలా..

manaarogyam

అందంగా కనిపించాలంటే ముఖం పై ఎటువంటి మచ్చలు ఉండకూడదు.. అప్పుడే చూడగానే అందరికి  నచ్చుతారు..చలికి లేదా ఫుడ్ పడక ముఖం పై మొటిమలు, వాటి తాలూకు మచ్చలు, ముడతలు ముఖాన్ని కాంతివిహినంగా చేస్తుంది. ఈ సమస్య నుంచి బయట పడటానికి ఎన్నెన్నో క్రిములు రాస్తారు. వాటికి బదులుగా ఇంట్లో దొరికే రైస్ తో క్రీమును తయారు చేసుకోవచ్చునని అంటున్నారు. అదేలానొ వివరంగా తెలుసుకుందాం..

ముందుగా ఒక గిన్నెలో రెండు స్పూన్ల బియ్యం వేసుకొని నిండా నీరు పోసి రెండు గంటలు నానబెట్టుకోవాలి. బియ్యం నానిన తరువాత ఒక మిక్సీ జార్లో బియ్యం నీటిని వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ నీటిని వడకట్టలి. ఒక గిన్నెలో ఈ రైస్ నీటిని పోసి స్టవ్ ఆన్ చేయాలి. క్రీమ్ దగ్గర పడే అంతవరకు తిప్పుతూ ఉండాలి.అంతే క్రీము రెడీ..ఈ క్రీముకు ఒక స్పూన్ అలోవెరా జెల్, ఒక స్పూన్ బాదం ఆయిల్, ఒక స్పూన్ చందనం పొడి, ఒక స్పూన్ తేనె వేసి కలిపి అన్నింటిని కలుపుకోవాలి.

ఇలా తయారుచేసుకున్న ఫేస్ ప్యాక్ ముఖానికి వేసుకునే ముందు గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకోవాలి.. అంతే ముఖం తెల్లగా,అందంగా మారుతుంది. మీరు కూడా ట్రై చెయ్యండి.

Leave a Comment