వీటిని ఫ్రిజ్ లో పెట్టడం వల్ల ఎంత ప్రమాదమో తెలుసుకోండి..

manaarogyam

ప్రస్తుతం మనుషుల్లో చురుకుదనం పోయి బద్దకస్తులు లాగా మారుతున్నారు..ఎంత బద్ధకం అంటే ఏరోజు వంట ఆ రోజు చేసుకోలేనంతగా.. ఒక రోజు చేసిన వంటలను ఫ్రిజ్ లో పెట్టి మూడు రోజులు తింటున్నారు.. అలా చేయడం వల్ల అనారొగ్య సమస్యలు ఎదురవుతాయని డాక్టర్లు ఎంత చెప్పినా ఎవరూ వినరు. ఇకపోతే ఫుడ్ మాత్రమే కొన్ని రకాల కాయలు, పండ్లు ఫ్రిజ్ లో పెట్టి తినడం వల్ల అనారొగ్య సమస్యలు తలెత్తున్నాయట.. అవేంటో ఒకసారి చూద్దాం..

పండ్లు

పండ్లు ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా తెచ్చుకుని తింటే ఆరోగ్యం. ఇలా నిల్వ చేసి తింటే అనారోగ్యం అంటున్నారు నిపుణులు. పండ్లను ఫ్రిజ్ లో పెట్టడం వల్ల పండ్లలోని లోపలి భాగం ఎండిపోయినట్టుగా అవుతుంది. అందువల్ల దానిద్వారా అందే పోషకాలు మీ శరీరానికి సరిగ్గా అందవట.

దోసకాయ

దోసకాయ లను ఫ్రిజ్ లో పెట్టి చేసుకోవడం వల్ల అవి రుచిని కొల్పొతాయట.. అంతేకాదు అవి మాగినట్లు సాగుతాయి.

వేయించిన ఆహారాలు

బాగా వేయించిన ఆహారాలు అంటే ఫ్రై చేసిన ఆహారాలను ఫ్రీజర్ లో ఉంచడం వల్ల దానిలోని కరకరలాడే గుణం పోయి సాగినట్టుగా తయారయ్యి, తినడానికి కష్టంగా తయారవుతుంది.

టమోటా సాస్

సాస్ నుండి నీళ్ళు విడిపోయి సాన్ రుచిగా ఉండకుండా తయారవుతుంది. అప్పుడు అది వాడినా కూడా రుచి లేకుండాపోతుంది. అందుకే ఈ సాస్ ను ఎప్పటికీ ఫ్రిజ్ లో పెట్టకూడదు.

Leave a Comment