Custard Apple :అనేక పోషకాలున్న సీతాఫలంను ఎవరు తినాలి..? ఎవరు తినకూడదు..?

manaarogyam

ప్రతిరోజూ ఆహారంతో పాటు ఇతర పదార్థాలు తీసుకున్నప్పుడు శరీరానికి అవసరమైన ఆరోగ్యం అందుతుంది. ముఖ్యంగా పండ్లు తీసుకోవడం వల్ల అనేక అదనపు పోషకాలు లభిస్తాయి. పండ్లల్లో సీతాఫలం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ప్రతీ సంవత్సరం సెప్టెంబర్ నుంచి నవంబర్ మధ్యలో ఎక్కువగా లభించే ఈ పండ్లు మనదేశానికి చెందినవి కావు. దక్షిణ అమెరికాలో ఇవి ఎక్కువగా ఉంటాయి. పోర్చుగీసువారు అక్కడి మొక్కలను మనదేశానికి తీసుకురావడం వల్ల ఇక్కడ పెంచారు. అలా దేశంలోని పలుచోట్లలో సీతాఫలం పండ్లు ప్రస్తుతం విరివిగా లభిస్తున్నాయి. అయితే సీతాఫలం ను ఎవరు తినాలి..? ఎవరు తినకూడదో చూద్దాం.

సీతాఫలంలో విటమిన్ సీ ఎక్కువగా లభిస్తుంది. ఇందులో ఉండే డైటరీ ఫైబర్ జీర్ణ శక్తిని పెంచడంలో అద్భుతంగా పనిచేస్తుంది. మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెంచడంలో సీతా ఫలం అద్భుతమైన పదార్థం. అలర్జీలకు వ్యతిరేకంగా ఇది పోరాడుతుంది. దీంతో సీతాఫలం తినడం వల్ల కొన్ని వ్యాధులు దరి చేరకుండా చేయొచ్చు. సీతాఫలంలో క్యాల్సియం, ఫాస్పరస్, మెగ్నిషియం సమృద్ధిగా లభిస్తాయి. మెగ్నిషియం శరీరానికి అందించడం వల్ల కండరాలకు విశ్రాంతిని ఇచ్చిన వారవముతాం. కాల్షియంతో ఎముకలు పటిష్టంగా మారుతాయి. ఇందులో ఉండే పీచు పదార్థాలు మలబద్ధంను పోగోడుతుంది.

Custard Apple
Custard Apple

సీతాఫలంలో చక్కెర స్థాయిలు అధికంగా ఉంటాయి. అందువల్ల షుగర్ ఉన్నవాళ్లు వీటికి దూరంగా ఉండడమే మంచిది. అలాగే ఉబ్బసం ఉన్నవారు కూడా వైద్యులను అడిగి తినాలి. ఇక సీతాఫలాన్ని ఖాళీ కడుపుతో తినకూడదు. ఒకవేళ తినాల్సి వచ్చినా ఎక్కువ నీరు తీసుకోవాలి. ఎదిగే పిల్లలకు సీతాఫలాలు ఒకటి, రెండు మాత్రమే ఇవ్వాలి. వారి ఎదుగుదలకు ఇది బాగా తోడ్పడుతుంది. హృద్రోగులు, నరాల బలహీనత ఉన్నవారికి ఈ పండు మంచి ఔషధం.

ఈ పండులో సల్ఫర్ అధికంగా ఉంటుంది. సల్ఫర్ శరీరానికి అందడం వల్ల చర్మవ్యాధులు రాకుండా ఉంటాయి. అంతేకాకుండా శరీరంలో ఉన్న క్రిములు, వ్యర్థపదార్థాలు వెంటనే తొలిగిపోతాయి. సీతాఫలం ఆకుల్లో హైడ్రోస్థెనిక్ ఆమ్లం చర్మ సంబంధిత వ్యాధులను పోగొడుతుంది. చర్మవ్యాధులతో బాధపడేవారు సీతాఫలం ఆకుల్లో పసుపు కలిపి మిశ్రమంగా తయారు చేయాలి. దానిని గజ్జి, తామర ఉన్న చోట పెడితె ఫలితం ఉంటుంది. సీతాఫంల బెరడును వేడి నీళ్లతో కాచిన తరువాత ఆ కషాయాన్ని తాగితే విరేచనాలు వెంటనే తగ్గుతాయి.

Leave a Comment