దొండకాయ పచ్చడి తింటే ఆ జబ్బులు మాయం..

manaarogyam

Updated on:

దొండకాయలు తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయొజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అయితే పచ్చడి తీసుకోవడం వల్ల కూడా ఎన్నో ప్రయొజనాలు ఉన్నాయని అంటున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. నోటిపూతకు దొండకాయ చెక్ పెడుతుంది. రోజూ కనీసం యాభై గ్రాముల దొండకాయను తింటే మధుమేహం అదుపులో ఉంటుంది.డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు దొండకాయ ఆకు కషాయం తాగడం వల్ల శరీర ఉష్ణోగ్రత సమతుల్యంగా ఉంటుంది.

కళ్లు చల్లబడతాయి. దొండకాయ ఆకుల కషాయం తాగడం వల్ల కంటి చికాకు పోతుంది.ఉండే కాల్షియం ఆరోగ్యకరమైనది. మూత్రపిండాల్లో రాళ్లను నయం చేయడానికి బచ్చలికూర వంటి ఇతర కూరగాయలతో కలిపి ఉపయోగించవచ్చు.దొండకాయలో పొటాషియం పుష్కలం. గుండెకు రక్త ప్రవాహాన్ని నియంత్రించడం, గుండె జబ్బులను నివారించడం ద్వారా గుండె యొక్క సరైన ఆరోగ్యానికి దొండకాయను తీసుకోవడం చాలా అవసరం అని నిపుణులు అంటున్నారు.

Leave a Comment