ఓవర్ గా ఎక్సెర్సైజ్ లు చేస్తే ఆ సమస్యలు వస్తాయా?

manaarogyam

ఎక్సెర్సైజ్ లు.. ఈరోజుల్లో చాలా మంది జీవన విధానం లో భాగమైంది.క్రమం తప్పకుండా కసరత్తులు చేస్తేనే అధిక బరువును అధిగమించగలరు. మరియు ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టగలరు. అలాగే ప్రతి రోజు ఎక్సర్‌సైజ్ చేసే వారిలో గుండె జబ్బులు వచ్చే రిస్క్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. అంతేకాదు, డైలీ ఎక్సర్‌సైజ్ చేయడం వల్ల అధిక రక్తపోటు, మధుమేహం, నిద్రలేమి, మానసిక సమస్యలు వంటివి కూడా దూరం చేసుకోవచ్చు.

అయితే ఎక్సర్‌సైజ్ ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ.. అతిగా చేస్తే మాత్రం అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు అంటున్నారు. అందులో ముఖ్యంగా సంతాన సమస్యలు. ఇటీవల కాలంలో చాలా మంది ఈ సంతాన సమస్యలు ఎదుర్కొంటున్నారు. వాస్తవానికి పెళ్లి అనేది దాంపత్య జీవితానికి ఒక నాంది మాత్రమే. కానీ, ఎప్పుడైతే సంతానం కలుగుతుందో.. అప్పుడే వారి దాంపత్య జీవితం సంపూర్ణమవుతుంది. అయితే ఈ సంతాన సమస్యలు కలగడానికి ఎక్సర్‌సైజ్ కూడా ఒక కారణం అంటే నమ్ముతారా.. అవును ఏదైనా అతిగా చేస్తె మంచి కన్నా కూడా చెడు ఎక్కువగా జరుగుతుందని నిపుణులు అంటున్నారు.

Leave a Comment