రాత్రి పడుకొనే ముందు వీటి జోలికి వెళ్ళకండి.. డేంజర్..

manaarogyam

మంచి ఆహారం తీసుకుంటే మంచి ఆరోగ్యం కూడా ఉంటుంది.రాత్రి సరిగ్గా నిద్ర ఉంటే మనిషి ఆరోగ్యం బాగుంటుంది. రాత్రి పడుకొనే ముందు తీసుకొనే ఆహారం బాగుండాలి. త్వరగా జీర్ణం అయ్యే వాటిని తీసుకోవడం ఉత్తమం.ఇకపోతే కొన్ని పనులు చేస్తె రాత్రి సరిగ్గా నిద్ర పట్టదు అని నిపుణులు అంటున్నారు.. అవేంటో ఒకసారి చూసేద్దాం…

రాత్రి నిద్ర పోయేటప్పుడు పిజ్జా తినడం వల్ల కూడా ఇబ్బంది వస్తుంది. పిజ్జాలో చీజ్ ఉంటుంది కదా దాని కారణంగా స్టమక్ అప్సెట్ సమస్య వస్తుంది.. ఇక రాత్రి పండ్ల రసాలు,జ్యూస్ లను అసలు తాగకూడదు. జలుబు వచ్చే ఆవకాశం ఉంది. అందుకే పండ్లను తీసుకోవడం మంచిది. నిద్ర తో పాటుగా ఆరోగ్యం కూడా.

కాఫీలోని కెఫిన్ వల్ల నిద్ర పట్టదు.అందుకే పడుకొనే ముందు కాఫిను తాగ వద్దని నిపుణులు హెచరిస్తున్నారు.. సోడా..ఆహారం తీసుకున్నాక అరగడం కోసం కొంచెం సోడాని తాగుతారు. అయితే నిజానికి సోడా తాగడం వల్ల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. స్టమక్ అప్సెట్ లాంటి ఇబ్బందులు సోడా వల్ల కలుగుతాయి.. అందుకే వీటికి రాత్రి దూరంగా ఉండండి..

Leave a Comment