డ్రాగన్ ఫ్రూట్ ను తింటూన్నారా? మీరు తప్పక ఇవి తెలుసుకోవాలి..

manaarogyam

డ్రాగన్ ఫ్రూట్ అంటే అందరికీ సుపరిచితమే..ఎన్నో ఆరోగ్య ప్రయొజనాలు ఉన్నాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అందుకే ఇటీవల కాలంలో వీటి వాడకం మరింత ఎక్కువ అయ్యింది.వీటి గురించి ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

ఈ పండ్ల లో విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్, డైటరీ ఫైబర్స్, పాలిఫినాల్స్ మొదలైనవి సమృద్ధిగా ఉంటాయి.వీటిని కొంతమంది తీసుకుంటే నష్టాలు కూడా ఉన్నాయని అంటున్నారు అవేంటో చూద్దాం..

విపరీతంగా డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఎలర్జీ వంటి ఇబ్బందులు కూడా వస్తాయి. గొంతులో మంట, బర్నింగ్ సెన్సేషన్ లాంటి సమస్యలకు దారితీస్తుంది.

గర్భిణీలకు డ్రాగన్ ఫ్రూట్ చాలా మేలు చేస్తుంది. కేవలం గర్భిణికి మాత్రమే కాకుండా కడుపులో శిశువుకి కూడా ఇది చక్కటి ప్రయోజనం ఇస్తుంది. అయితే ఎవరైనా సరే లిమిట్ గా తీసుకోవడం మంచిది.అది కూడా లిమిట్ గా తింటే చాలా మంచిది..

ఫైబర్ ఆరోగ్యానికి చాలా మంచిది.. అలాగని అధిక ఫైబర్ కూడా ఆరోగ్యానికి మంచిది కాదు.ఎక్కువ ఫైబర్ వుండే డ్రాగన్ ఫ్రూట్ ను తీసుకోవడం వల్ల కడుపునొప్పి, ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ లాంటి ఇబ్బందులకు గురి అవుతుంది.అందుకే వీటిని తీసుకోవడం వల్ల ఎంతగా నష్టం ఉందో అంతకు మించిన నష్టాలు కూడా ఉన్నాయని గుర్తుంచుకోండి…

Leave a Comment