పుట్నాలను ఎక్కువగా తింటే ఎన్ని ప్రయోజనాలున్నాయో..

manaarogyam

పుట్నాలను ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా పిలుస్తారు. ఒక్కో విధమైన వంటలను కూడా చెసుకుంటారు.. అయితే వీటిలో ఎన్ని ఆరోగ్య ప్రయొజనాలు ఉన్నాయో మాత్రం ఎవరికీ తెలియదు.అయితే వీటిని తినడం వల్ల ఎటువంటి ప్రయొజనాలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

ప్రొటీన్లు అధికంగా ఉండే పుట్నాలను రోజు వారీ ఆహారంలో తరచుగా తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం, దీర్ఘాయువు మెరుగుపడుతుంది. పుట్నాలలో సులభంగా జీర్ణమయ్యే ప్రోటీన్, ఫైబర్ ద్వారా మనం తిన్న ఆహారం బాగా జీర్ణం కావడానికి సహాయపడుతుంది.అలాగే శరీరంలోని వ్యర్థాలను తొలగించి, అంతర్గత అవయవాలను శుభ్రపరచి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. పుట్నాలలో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి, ఇది మంచి ఆరోగ్యానికి అవసరం.

కణాలు, కణజాలాలు, ఎముకలు, కండరాల నిర్మాణానికి ప్రోటీన్ అవసరం. ఈ పుట్నాలను తీసుకుంటే చర్మం నుండి దద్దుర్లు, గజ్జి, తామరలను త్వరగా తొలగించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. చర్మంపై ముడతలను తొలగిస్తుంది.గర్భిణీ స్త్రీలు పుట్నాలను సరైన నిష్పత్తిలో తీసుకోవడం వల్ల వారికి గర్భస్థ శిశువుకు మేలు జరుగుతుంది. ప్రసవ సమయంలో నొప్పి, శారీరక అలసట నుండి ఉపశమనం పొందడం జరుగుతుంది. జుట్టు పెరుగుదలకు దోహదపడుతుంది..

Leave a Comment