కొబ్బరి నీళ్ళతో అధిక బరువుకు చెక్..

manaarogyam

చలికాలంలో బరువు అనేది మనకు తెలియకుండానే పెరిగి పోతారు..మామూలు సీజన్ లలో ఉదయం బయటకు వెళ్ళి కనీసం వాకింగ్ చేసి వాళ్ళు ఇప్పుడు చలి తీవ్రత ఎక్కువగా ఉండటం తో ఇంట్లోనే వుండిపోతారు. బరువు తగ్గాలని కోరుకునే వారికి కొబ్బరి నీళ్ళు మంచి ఉపాయం.

కొబ్బరి నీరుతో అధిక బరువు సమస్యకు చెక్ పెట్టవచ్చట. ఎందుకంటే.. కొబ్బరి నీరు తాగడం వల్ల తక్షణ శక్తి లభిస్తుంది. అదే సమయంలో ఎక్కువ సమయం పాటు కడుపు నిండిన భావన కలిగి.. ఆకలి వేయకుండా ఉంటుంది. దీంతో వేరే ఆహారం తీసుకునే వీలు పడదు. తద్వారా అధిక బరువు తగ్గొచ్చు. అంతే కాదు మన శరీరం లో పెరుకుపొయిన అధిక కొవ్వును కరిగిస్తుంది..

కొబ్బరి నీరు తాగితే.. అందులో ఉండే విటమిన్స్‌, మినరల్స్‌ గుండె జబ్బులు రాకుండా రక్షిస్తాయి. అదే సమయంలో అధిక రక్తపోటును అదుపులోకి తెస్తాయి. అలాగే కొబ్బరి నీరు తాగడం వల్ల కూడా శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఎందుకంటే.. కొబ్బరి నీరులో రోగ నిరోధక శక్తి పెంచే విటమిన్ సీతో పాటు ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది. ఇక మధుమేహం సమస్య ఉన్నవారు ఈ నీళ్ళు తాగడం వల్ల షుగర్ కంట్రోల్ అవుతుంది.చర్మం అందంగా ఉండాలంటే కొబ్బరి నీళ్ళు తప్పక తాగాల్సిన అవసరం ఉంది

Leave a Comment