మెంతికూర తో ఇలా చేసుకొని తిన్నారా?

manaarogyam

మెంతికూరలో ఎంతో ఆరోగ్యం ఉందన్న విషయాన్ని నిపునులు పదే పదే చెబుతారు..అప్పటి వాళ్ళు కాలానికి తగ్గట్లు వంటలను చేసుకొని తింటారు.ఇలా చేయడం వల్ల కొన్ని రోగాలు రావట..ఇప్పటికీ అలా చాలా మంది చేసుకుంటూన్నారు.అందులో ఒకటి మెంతికూర ఒకటి.. పప్పు, పరోటా లు కాకుండా పకోడీలు కూడా చేసుకొవచ్చు అంటూన్నారు.. కావలసిన పదార్థాలను,తయారీ విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

కావలసినవి..

మెంతి కూర: 2 కప్పులు, ఉల్లిపాయ: 1,
పచ్చిమిర్చి: 2,
అల్లం: అర అంగుళం ముక్క,
పసుపు, ఉప్పు, కారం: సరిపడా,
బేకింగ్‌ సోడా: చిటికెడు,
శనగపిండి: మూడు స్పూన్లు

తయారి విధానం..

ముందుగా మెంతి ఆకులను శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి.ఉల్లిపాయ, అల్లం, పచ్చిమిర్చి ముక్కలు, కారం, పసుపు, ఉప్పు, బేకింగ్‌ సోడా వేసి కలుపుకోవాలి. చివర్లో శనగపిండి వేసి, పావు కప్పు నీళ్లు కలిపి కలుపుకోవాలి. పిండిలో ఉండలు లేకుండా కలుపుకుని, మూత పెట్టి, ఐదు నిమిషాలు పక్కనుంచాలి. పిండి మరీ చిక్కగా కాకుండా, మరీ జారుడుగా కాకుండా చూసుకోవాలి. ఇప్పుడు పాన్ పెట్టి డీ ప్రై కి సరిపడా ఆయిల్ వేసి పకోడీ లను వేసుకోవాలి.. ఈ పకోడీ లను పుదీనా చట్ని తో తింటే చాలా రుచిగా వుంటాయి.. మీరు కూడా ట్రై చేయండి..

Leave a Comment