మెడ వెనుక నలుపు పోవాలంటే.. ఈ టిప్స్ తప్పనిసరి..!

manaarogyam

పెరుగుతున్న కాలుష్యాల వల్ల చర్మ, జుట్టు సమస్యలు రావడం సహజం. దుమ్ము దూళి కారణంగా మెడ వెనుక భాగం నల్లగా మారుతుంది.నిండుగా ఉన్న బట్టలు వేసుకోవడం వల్ల అది పెద్దగా కనిపించదు.కానీ కొన్ని సందర్భాలలో మాత్రమే ఇబ్బంది పెడుతుంది.మెడ వెనక భాగం నల్లగా ఉండటానికి మూడు రకాల కారణాలు ఉంటాయి. వీటిలో మొదటిది మెడను సరిగ్గా శుభ్రం చేసుకోకపోవటం. మధుమేహం, కొన్ని రకాల చర్మ వ్యాధుల వల్ల కూడా మెడ నల్లగా ఉంటుంది. కొన్ని సార్లు వేసుకొనే మందులు పడకపోతే కూడా మెడ నల్లగా మారుతుంది.

ఈ నలుపు పోవాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.. అవేంటో వివరంగా తెలుసుకుందాం..

మెడ వెనక భాగాన్ని శుభ్రంగా కడగాలి. నల్లటి మచ్చలు కనిపిస్తే సన్‌స్ర్కీన్‌ లోషన్‌ను రాసుకోవాలి. అలోవిరా, కొబ్బరినూనెలను రాసినా మంచి ఫలితం ఉంటుంది..

మెడ మరింత నల్లగా మారితే మెడ నిండా నగలను వేసుకోవడం మంచిది కాదు. దీని వల్ల సమస్య మరింత పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.

బరువు తగ్గితే అటువంటి మచ్చలు తొలిగిపోతాయి.. అప్పటికీ పోకుంటే చర్మ వ్యాధుల డాక్టర్ల ను సంప్రదించండి..

Leave a Comment