Eggs :గుడ్డును ఇలా తీసుకోవడం మంచిది..

manaarogyam

Updated on:

కోడి గుడ్డును తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది.ప్రతి రోజూ మన ఆహారంలో భాగంగా గుడ్డును ఏదో ఒక రూపంలో తీసుకోవాల్సి ఉంటుంది. చాలామంది ఉడకబెట్టిన గుడ్డును తినడానికి ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారు వివిధ రకాల రెసిపిలను తయారు చేసుకొని గుడ్లను తినవచ్చు. ఈ క్రమంలోనే ఉడికించిన కోడి గుడ్డు కాకుండా ఆమ్లెట్ వేసుకొని తినవచ్చు. ఎగ్ చాట్ తయారు చేసుకొని తినవచ్చు. అలాగే ఎగ్ బోండా, ఎగ్ దోశ, ఎగ్ పకోడీలను వేసుకుని తినవచ్చు.

ఉడికిన గుడ్లతో ఎగ్ కబాబ్ ను ఎంతో సులభంగా తయారు చేసుకోవచ్చు. ముందుగా గుడ్లను ఉడకబెట్టి పెంకు తీసుకోవాలి. అనంతరం శనగపిండిలో కొద్దిగా ఉప్పు, కారం కలుపుకుని ఉడికిన కోడిగుడ్లను శనగపిండిలో కలిపి కాగిన నూనెలో వేసి ఎరుపు రంగులో వచ్చే వరకు వేయించుకోవాలి. దీంతో రుచిగా వాటిని తినవచ్చు.ఎగ్ చాట్ తయారు చేసుకోవడం ఎంతో సులభం. ఉడికించిన కోడి గుడ్డుపై పెంకు తీసి అందులోకి ఉప్పు, కారం, ఉల్లిపాయలు, టమోటా ముక్కలు, కొత్తిమీర తరుగు కలుపుకుంటే.. ఎంతో సులభంగా ఎగ్ చాట్ తయారవుతుంది. దీన్ని రుచిగా తినేయవచ్చు. ఇలా ఎగ్ పరాట  ను కూడా తయారు చేసుకోవచ్చు..

Leave a Comment