మోచేతులు నల్లగా ఉన్నాయా? ఈ టిప్స్ మీ కోసం..

manaarogyam

చాలా మందికి మోచేతులు నల్లగా ఉంటాయి.ఇది పెద్ద సమస్యగా మారింది.చర్మం ఎంత తెల్లగా, అందంగా ఉన్నా.. మోచేతల దగ్గర మాత్రం నల్లగా, రఫ్‌గా ఉంటుంది. ఇది సాధారణ సమస్య అయిన చూడటానికి ఏదోలా కాస్త ఇబ్బందిగా ఉంటుంది.ఎన్నో ప్రయత్నాలు చేసి విసిగిపోయి ఉంటారు. అలాంటి వారి కోసం ఈ సింపుల్ టిప్స్..

ఒక నిమ్మకాయ ను తీసుకొని సగానికి కట్ చేసి కట్ చేసిన నిమ్మ ముక్కను ఉప్పులో అద్ది.. మోచేతులకు రెండు నిమిషాల పాలు రుద్దాలి. అనంతరం చల్లటి నీటితో క్లీన్ చేసుకోవాలి. ఇలా ప్రతిరోజు చేయడం వల్ల మోచేతుల నలుపు క్రమంగా తగ్గిపోతుంది. అలాగే శనగపిండిలో పెరుగు కలిపి పేస్ట్‌లా చేయాలి. ఈ మిశ్రమాన్ని మోచేతులకు అప్లై చేసి ఆరిన తర్వాత కడిగేయాలి.

మరో చిట్కా.. బియ్యప్పిండి తీసుకొని,అందులో రోజ్ వాటర్ వేసి బాగా మిక్స్ చేసి ఎక్కడ నల్లగా ఉంటుందో అక్కడ అప్లై చేసుకోవాలి.ఆరిన తర్వాత కడిగేయాలి.. ఇలా తరచూ చేస్తె మంచి ఫలితం ఉంటుంది.వంట సోడా లో కొద్దిగా నీళ్ళు పోసి మోచేతులకు అప్లై చేసుకోవాలి.పావు గంట ఆగి గోరు వెచ్చని నీటితో కడిగేయాలి.. ఇలా వారంలో మూడు సార్లు చేస్తే నలుపు పోయి తెల్లగా మారతాయి.. ఈ టిప్స్ మీకు నచ్చితే మీరు కూడా ట్రై చెయ్యండి..

Leave a Comment