ఏది తిన్నా కూడా బరువు పెరగడం కామన్.. పెరిగినంత సులువుగా తగ్గడం చాలా కష్టం.బరువు పెరగడం తో చూడటానికి అందవిహీనంగా మారతారు.
ఆహారం తినడం వల్లే కాదు మరికొన్ని కారణాల వల్ల కూడా బరువు పెరిగిపోతుంటారు. ఇక అధిక బరువు కారణంగా ఎన్నో అనారోగ్య సమస్యలూ తలెత్తుతుంటాయి. అందుకే బరువు తగ్గడం చాలా అవసరం.

అయితే బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్న వారు.. పుట్టగొడుగులను తమ డైట్‌లో చేర్చుకుంటే ఎంతో మేలు చేస్తాయని నిపుణులు సలహా ఇస్తున్నారు.వీటిలో పోటాషీయం ఎక్కువగా వుంటుంది. ఇది బరువును కంట్రోల్ చేస్తుందని అంటున్నారు.వీటిని తీసుకోవడం వల్ల ఎక్కువ సేపు ఆకలి వేయదు.బరువు తగ్గాలనుకునే వారు పుట్టగొడుగులను వారానికి కనీసం రెండు సార్లు అయినా తీసుకుంటే మంచిది. ఇక పుట్టగొడుగులతో బరువు తగ్గడమే కాదు.. మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే పుట్టగొడుగులను తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి బలపడుతుంది.. జీర్ణ సంబంధిత వ్యాధులు రాకుండా కట్టడి చేస్తుంది. ఇంకా ఎన్నొ వ్యాధులను నయం చేయడం లో ఇవి సహాయపడతాయి.