రోజూ యోగ చేయడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. ముఖ్యంగా మగవారికి మంచి ప్రయొజనాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు.శరీరంలోని అవయవాల పనితీరును మెరుగు పరిచేందుకు చక్కగా పని చేస్తుందని మాత్రమే మనకు తెలుసు. కానీ యోగాసనాలతో మన శరీరంలో జన్యుస్థాయిలో మార్పులు జరుగుతాయనే విషయం తెలియదు. తాజాగా ఒక సంస్థ చేపట్టిన అధ్యయనంలో యోగాతో పురుషులలో వీర్యకణాల సంఖ్య పెరుగుతాయని తేలింది. ఇది నిజంగా అద్భుతం అనే చెప్పాలి.

పిల్లలు పుట్టక పోవడం అనేది మగ వారిలో వుండే లోపం అనే చెప్పాలి.వీర్య కణాల సంఖ్య తక్కువగా ఉండటంతో మహిళలు గర్భం దాల్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి.ప్రాణాయామం, ధ్యానం చేస్తే సహజ సిద్ధమైన పద్ధతిలో పురుషులలో వీర్య కణాల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుందని ఒక సంస్థ చేపట్టిన అధ్యయనంలో తేలింది.. ఒక పది మందిని సెలెక్ట్ చేసుకొని వారితో యోగా చేయించింది.పురుషుల్లో వీర్యకణాల సంఖ్య కూడా పెరిగిందని తేలింది. కనుక యోగాకి వీర్యకణాల సంఖ్య పెరగడానికి మధ్య సంబంధం ఉందని కనుగొన్నారు. యోగ శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరిచి జన్యు స్థాయిలో మార్పులను తెస్తుంది. చుసారుగా ఇటువంటి సమస్యలు తగ్గాలనుకునే వారికి యోగా బెస్ట్ చాయిస్..