సీ ఫుడ్ ఏదైనా మంచి ఆరోగ్యం అన్న విషయం తెలిసిందే.. అందులో రొయ్యలు చాలా రుచిగా ఉంటాయి. అంతేకాదు ఆరోగ్యానికి కూడా మంచిది. రొయ్యలు తరచూ తీసుకోవడం వల్ల కొన్ని వ్యాధులు నయం అవుథాయని నిపుణులు అంటున్నారు.. మరి ఎలా తీసుకొవలొ ఇప్పుడు ఒకసారి చూద్దాం..
రొయ్యలను తినడం వల్ల కలిగే అతిపెద్ద ప్రయోజనాల్లో ఒకటి ఏమిటంటే అవి బరువు తగ్గించే కార్యక్రమాలలో సహాయపడతాయి. ఈ చిన్నరొయ్యల్లో విటమిన్లు, అయోడిన్, ప్రొటీన్లు, జింక్ పుష్కలంగా ఉంటాయి. అవి కార్బోహైడ్రేట్ల తక్కువ మోతాదులో కలిగి వుంటాయి. అదనపు పౌండ్లను తగ్గించుకోవాలని చూస్తున్న వారికి ఇవి మంచి ఎంపిక. జింక్ ఆకలిని అరికట్టగలదు.

జింక్ జుట్టు కణాలతో సహా కణాల ఉత్పత్తికి సహాయపడుతుంది. స్కాల్ప్‌లోని ఆయిల్ గ్లాండ్స్ సక్రమంగా పనిచేయడానికి కూడా ఇది అవసరం. రాగి ఖనిజం జుట్టు రాలడాన్ని తగ్గించడమే కాకుండా, జుట్టు మందం మంచి రంగును కలిగి ఉంటాయి.పుష్కలంగా సెలీనియం తీసుకోవడం వల్ల క్యాన్సర్‌తో మరణించే ప్రమాదాన్ని తగ్గిస్తుందని అధ్యయనాలు సూచించాయి. శరీరం యొక్క రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడం ద్వారా, కణితులకు రక్త నాళాలు అభివృద్ధి చెందకుండా నిరోధించడం జరుగుతుంది.. నెలలో ఒక్కసారి అయినా రొయ్యలు తినడం మేలు..