వంటింట్లో దొరికే వెల్లుల్లి వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో ప్రత్యెకంగా చెప్పాల్సిన పనిలేదు.సర్వ రొగాలను నయం చేయడం లో ఇది ఉపయోగపడుతుంది. అయితే వంటలలో ఎక్కువగా వాడే ఈ వెల్లుల్లి తో సూప్ చేసుకొని తాగితే చాలా మంచిదని నిపుణులు అంటున్నారు.. ఎలా తయారు చెస్తారో ఇప్పుడు ఒకసారి వివరంగా తెలుసుకుందాం.
ఎనిమిది వెల్లుల్లి రెబ్బలు, ఒక బంగాళదుంప, ఒక ఉల్లిపాయ, అర చెంచా జీలకర్ర , ఆలివ్ ఆయిల్ రెండు స్పూన్లు, ఫ్రెష్ క్రీమ్ అర కప్పు, ఒరెగనో 1 స్పూన్, ఉప్పు చిటికెడు, నీళ్లు ఒక గ్లాసు అవసరం. ముందుగా ఒక పాన్ తీసుకొని అందులో ఆలివ్ ఆయిల్ వేసి అందులో జీలకర్ర, సన్నగా తరిగిన ఉల్లిపాయ, వెల్లుల్లి, బంగళా దుంప ముక్కలను వేసి వేయించుకోవాలి. బాగా మగ్గాక ఇందులో క్రీమ్ వేసి ఐదు నిమిషాలు ఉంచాలి..దానిని బాగా బ్లెండ్ చేయాలి.
విటమిన్ బి6, సి, తో పాటు యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి. ఈ కాలంలో వచ్చే అనేక రకాల వ్యాధులను రాకుండా చేస్తాయి. ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో ఈ సూప్ తాగితే మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి. శరీరం లో పెరుకుపొయిన కొవ్వును తగ్గించడంతోపాటు మరెన్నో ఫలితాలను కలిగి ఉంటుంది.