వేడి వేడి నీళ్ళతో స్నానం చేస్తున్నారా?

manaarogyam

ప్రస్తుతం చలికాలం కాబట్టి అందరూ వేడిని కోరుకుంటున్నారు.. ఏదైనా వేడిగా వుంటే బాగుండును అని భావిస్తున్నారు. ఈ కాలంలో వేడి నీటితో స్నానం చేయడం చేస్తారు.అలా మరీ వేడిగా వున్న నీళ్ళతో స్నానం చేయడం అంత మంచిది కాదు అని నిపుణులు అంటున్నారు. ఎందుకు మంచిది కాదో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

నిజానికి వేడి నీటితో స్నానం చేయడం వల్ల కూడా బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు పొందొచ్చు. మరి అవేంటో లేట్ చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం. ఇటీవల కాలంలో నిద్రలేమి సమస్య చాలా మందిని వేధిస్తుంది. ఇలాంటి వారికి ఎంత పడుకుందామన్నా.. నిద్రే రాదు. అయితే అలాంటి వారు పడుకునే ముందు వేడి నీటితో స్నానం చేస్తే.. మంచి నిద్ర పడుతుంది. అలాగే మిగిలిన వాళ్లతో పోల్చితే.. వేడి నీటి స్నానం చేసే వారిలో గుండె జబ్బులు వచ్చే చాలా తక్కువగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

ఎందుకంటే, వేడి నీటి స్నానం గుండెకు సరైన రక్త ప్రసరణ అందించి.. దాని పనితీరుని మెరుగు పరుస్తుందట. తద్వారా గుండె పోటు, ఇతర గుండె జబ్బులు రాకుండా ఉంటాయని అంటున్నారు.మానసిక ఒత్తడి, తలనొప్పి పోయి.. మైండ్ ఫ్రెష్ అవుతుంది. రక్తపోటు అదుపులో ఉంటుంది. రోజు మొత్తం పని చేసి అలసిపోయిన వారు వేడి నీటితో స్నానం చేస్తే.. కండరాలు బాగా రిలాక్స్ అవ్వడంతో పాటు శరీరాన్ని మళ్లీ ఎనర్జీ మోడ్‌లోకి తీసుకువస్తుంది. ఇదండీ వేడి నీళ్ళతో స్నానం చేయడం వల్ల కలిగే లాభాలు..

Leave a Comment