బోన్ సూప్ అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది.. ఆ రుచి వేరే లెవల్.. ఈ సూప్ ను చికెన్ లేదా మటన్ తో చేస్తారు.ఈ సూప్ లో ఎన్నో పొషక విలువలు ఉన్నాయని అంటున్నారు.ఈ సూప్ ను వారానికి ఒకసారైన తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయొజనాలు ఉన్నాయని తెలుస్తుంది. ఇక ఆలస్యం చేయకుండా ఈ సూప్ ను ఈజిగా ఎలా తయారు చేసుకోవాలి. కావలసినవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఇప్పుడు మనం చికెన్ సూప్ ను చేసుకుందాం..
కావలసినవి..
చికెన్:పావు కేజీ(బోన్స్)
పచ్చిమిర్చి తరుగు:రెండు స్పూన్లు
కొత్తిమీర తరుగు: ఒకస్పూన్
మిరియాలు: ఐదు
ఉల్లిపాయ తరుగు: అరకప్పు
టమోటా తరుగు:అర కప్పు
ఉప్పు: సరిపడా
అల్లం వెల్లుల్లి పేస్ట్:ఒక స్పూన్
తయరీ విధానం:
ఉల్లిపాయ, అల్లంవెల్లుల్లి, మిరియాలు మిక్సీలో వేసి మెత్తని పేస్టులా చేసుకోవాలి. మటన్ లేదా చికెన్ ఎముకలను శుభ్రం చేసి కుక్కర్లో వేయాలి. అందులోనే ముందుగా చేసుకున్న పేస్టు, టమాటో, పచ్చిమిర్చి, ఉప్పువేసి బాగా కలపాలి. రెండు నుంచి మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఉడికాక కుక్కర్ పై మూత తీసి కాసేపు స్టవ్ మీద ఉడికించాలి. అందులో నూనె ను అర స్పూన్ వేయాలి.. కాసేపు వుంచి ఆఫ్ చేయాలి. పైన కొత్తిమీర చల్లి వేడి వేడిగా తాగితే చాలా చాలా రుచిగా ఉంటుంది..