గుప్పెడు బాదాం తో గంపెడు ఆరోగ్య ప్రయొజనాలు..

manaarogyam

Updated on:

బాదాం.. వీటిలో ఎన్నో పొషకాలు దాగి ఉన్నాయి.. అందుకే వీటిని రాత్రిపూట నానపెట్టి ఉదయం తినమని డాక్టర్లు కూడా చెబుతున్నారు. రోగ నిరోధక శక్తి మెరుగుపడటంలో బాదములు తోడ్పడతాయని 84% మంది భావిస్తున్నారు.బాదములు తినడం వల్ల ఒత్తిడి తగ్గుతుందని చెబుతున్నారు.ఉత్తరాదిలో ప్రతి నలుగురులో ముగ్గరు తమ పోషకాహార అవసరాల పట్ల ఆందోళన చెందుతున్నారు. 51% మంది తాము స్నాక్స్‌ కొనుగోలు చేసేటప్పుడు పోషక విలువలు, పదార్థాలకు అమిత ప్రాధాన్యతనిస్తామంటున్నారు.

ఈ తరహా సమాధానాన్ని 26-35 సంవత్సరాల మహిళల నోట ఎక్కువగా వింటే,అనంతరం 18-25 సంవత్సరాల వయసు వారు ఉంటున్నారు.61% మంది ఇంటి వంటకే అధిక ప్రాధాన్యతనందిస్తున్నారు. దాదాపు 50% మంది రోజుకోమారు స్నాక్స్‌ తీసుకుంటామంటుంటే, 41% మంది రెండు సార్లు తాము రోజూ స్నాక్‌ తీసుకుంటామంటున్నారు. పిల్లలు కూడా వీటిని ఇష్టంగా తింటారు. అందుకే వీటికి డిమాండ్ కూడా పెరిగింది.

Leave a Comment