కరోనా భయం తో మాస్క్ లను పెట్టుకోవడం చేస్తున్నారు. అయితే ఈ మాస్క్ ల వల్ల కొంత మేలు జరిగితే, చాలా నష్టం జరుగుతుంది.మాస్కు వాడటం వల్ల వారికి చర్మంపై నల్లటి మచ్చలు సమస్యలు వేధిస్తున్నాయి. ఇలాంటి సమస్యలు రాకుండా ఉండాలి అంటే మాస్క్ వేసుకోవడం మానేయాలి. అలాంటి సమస్యల నుంచి బయట పడాలంటే ఇలా తప్పక చేయాలి.
మాస్కు వేసుకున్నప్పుడు మాటిమాటికి తీసేయడం వల్ల ఉపయోగం ఉండదు కాబట్టి వీలైనంత వరకు స్కిన్ కి సరిపడా మాస్క్ వేసుకొని బయటికి వెళ్ళాలి. రోజంతా ఒకే మాస్క్ కాకుండా వీలైనంత వరకు ప్రతి నాలుగు గంటలకు ఒకసారి మాస్కు మార్చడం మంచిది. బయటనుంచి వచ్చిన తర్వాత ఆ మాస్కును ఎండలో కాసేపు వేయాలి. ఇలా మాస్కులు మార్చడం వల్ల కూడా మనం చర్మ సమస్యల బారిన పడకుండా రక్షించుకోవచ్చు.మాస్క్ తో పని అయ్యాక ఇంటికి రాగానే తీసి వేసి చల్లని నీటితో కడిగేయాలి. ఇలా చేయడం వల్ల కొంత వరకూ అటువంటి సమస్యలు తగ్గుతాయి.