చలికాలంలో మెంతికూర తినడం వల్ల కలిగే అద్భుతాలు ఇవే..

manaarogyam

మెంతికూర పొషకాల పుట్టినిల్లు అని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు..ఈ మెంతులు, వాటి ఆకులను తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా చలికాలంలో మరింత ఎక్కువ లాభాలు ఉన్నాయి.ఒక టీస్పూన్ మెంతికూరలో 6 గ్రాముల కార్బోహైడ్రేట్, 3 గ్రాముల ఫైబర్, 3 గ్రాముల ప్రోటీన్, 1 గ్రాము కొవ్వు ఉన్నాయి. అంతేకాకుండా.. ఐరన్, మాంగనీస్, మెగ్నీషియం కూడా ఉన్నాయి. మెంతులు వేడిని కలిగిస్తాయి. చలికాలంలో వీటిని ఎక్కువగా ఉపయోగిస్తారు.

అంతేకాకుండా.. చలికాలంలో మెంతికూర, మెంతులతో అనేక ప్రయోజనాలున్నాయి. వాటి గురించి వివరంగా తెలుసుకుందాం..యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది.మెంతులలో ప్రోటీన్లు, కొవ్వులు, పిండిపదార్థాలు, క్యాల్షియం, విటమిన్ ఎ,సి, కె, బి, రాగి, పీచుపదార్థం కూడా ఉంటాయి.మధుమేహాన్ని కంట్రోల్ ఉంచుతుంది.కొలెస్త్రాల్ ను తగ్గిస్తుంది. జలుబు,దగ్గు కూడా మెంతులు వల్ల దరి చేరవు..తక్కువ ఖర్చుతో దొరికే వీటితో ఎన్ని ప్రయొజనాలు ఉన్నాయో.. ఇప్పటి నుంచి మెంతికూర ను ఆహారంలో చేర్చుకొండి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి..

Leave a Comment