High BP : బీపీ కంట్రోల్ లో ఉండాలంటే ఈ పదార్థాలను తీసుకోండి..

manaarogyam

ఇప్పుడున్న చాలా మందిలో బీపీ కామన్ అయిపోయింది. పని ఒత్తిడి కారణంగా వారిలో సహజంగానే బీపీ పెరుగుతుంది. అయితే ఇది ఒక్కోసారి హై స్థాయికి వెళ్లి ప్రాణాలు పోయిన సంఘటనలూ ఉన్నాయి. హై బీపీతో గుండె సమస్యలు తీవ్రం కావచ్చు. పోను పోను హార్ట్ ఎటాక్ కు కూడా గురయ్యే ప్రమాదం ఉంది. అందువల్ల ఎప్పటికప్పుడు బీపీని కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. బీపీ కంట్రోల్ కావడానికి చాలా మంది ప్రతిరోజు మెడిసిన్ వాడుతూ ఉంటారు. మెడిసిన్ మాత్రమే కాకుండా ఇంట్లో ఉండే పదార్థాలతో కొన్ని చిట్కాలు పాటిస్తే బీపీ మరింత కంట్రోల్ అయ్యే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఆ చిట్కాలేంటో చూద్దాం..

బీపీ కంట్రోల్ కావడానికి ఇంట్లో ఉండే దివ్యౌషధం వేడి నీళ్లలో నిమ్మరసం. ఉదయం లేవగానే గ్లాసు వేడి నీటిని తీసుకోవాలి. ఇందులో అర చెక్క నిమ్మరసం వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని పరిగడుపునే తీసుకోవాలి. ఇలా ప్రతి రోజూ తాగడం వల్ల బీపీ కంట్రోల్ కావచ్చు. మీరు రోజంతా ఎలాటి పని ఒత్తిడిలో ఉన్న బీపీ పెరిగే అవకాశాలు తక్కువగా ఉంటాయి. వీటితో పాటు మరో చిట్కా కూడా పాటించవచ్చు. పుచ్చకాయ విత్తనాలు పొడిగా చేసుకోవాలి. వాటిలో గసగసాలను కలుపుకొని ఉదయం, రాత్రి రెండు పూటలు ఓ స్పూన్ తీసుకోవాలి. ఇలా చేస్తే ఫలితం ఉంటుంది.

అవేవీ సాధ్యం కానప్పుడు ఇంట్లో అందుబాటులో ఉండే వెల్లుల్లితో కూడా బీపీని కంట్రోల్ చేసుకోవచ్చు. కొన్ని వెల్లుల్లి రెబ్బలను తీసుకొని పొడిగా వచ్చే వరకు చిదిమాలి. ఇలా పొడిగా మారిన తరువాత నేరుగా నోట్లో వేసుకొని తినాలి. ఇలా తినడం ఇబ్బందిగా ఉంటే అందులో కొంచెం తేనె కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల బీపీ కచ్చితంగా కంట్రోల్ అవుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

అయితే బీపీ మాత్రలు ప్రతిరోజూ వాడేవారు వైద్యుల సలహా తీసుకోవడం మంచిది. టాబ్లెట్ వేసుకోని వారు మాత్రం ఇలాంటి చిట్కాలు పాటించడం వల్ల నార్మల్ స్టేజిలో ఉంటారు. లేకుంటే హై బీపీతో అనేక ఆనారోగ్య సమస్యలు తెచ్చుకున్నవారవుతారు. అందువల్ల బీపీని కంట్రోల్ చేసుకోవడానికి ఇంట్లో అందులోబాటులో ఉంటే ఈ చిన్న చిట్కాలను పాటించండి.

Leave a Comment