Teeth Cavity : పుచ్చిపోయిన దంతాలు మళ్లీ మాములుగా కావాలంటే ఈ చిట్కాలు పాటించండి..

manaarogyam

Updated on:

Teeth Cavity : నేటి కాలంలో ప్రతి ఒక్కిరికి ఏదో ఒక అనారోగ్య సమస్య వెంటాడుతోంది. కొందరికి శారీరక సమస్యలుంటే..మరికొందరు మానసిక వ్యాధులతో ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల కాలంలో ఎక్కువగా దంత సమస్యలతో బాధపడుతున్న వారు పెరుగుతున్నారు. చాలా మంది నోటిని శుభ్రం చేసుకోకపోవడం వల్ల దంతాక్షయం పెరిగిపోతుంది. దీంతో పన్ను నొప్పి ఏర్పడినప్పుడు తీవ్రంగా బాధపడుతూ ఉంటారు. సాధారణంగా దంతాక్షయం ఏర్పడిన తరువాత వైద్యుల వద్దకు వెళ్లి మెడిసిన్ వాడడం సాధారణమే కానీ దంతాక్షయం రాకుండా ఉండడానికి కొన్ని చిట్కాలు పాటిస్తే ఎలాంటి సమస్యలు ఉండవంటున్నారు ఆరోగ్య నిపుణులు. అవేంటో ఒకసారి చూద్దాం..

మన శరీరం దృఢంగా ఉండాలంటే పౌష్టికాహారం తీసుకోవాలి. అలాగే పళ్లు బలంగా ఉండాలంటే కూడా సరైన ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది. పళ్లకు కాల్షియం తక్కువైతే దంతాక్షయం వస్తుంది. అలాంటప్పుడు కాల్సియం ఎక్కువగా లభించే పదార్థాలను తీసుకోవాలి. పాలు, పెరుగు, క్రీం, చీజ్ వంటి డెయిరీ ఉత్పత్తుల్లో కాల్షియం సమృద్ధిగా ఉంటుంది. షుగర్ లెస్ చూయింగ్ గమ్ లో జైలిటాల్ అనే పదార్థం ఉంటుంది. ఇది నమలడం వల్ల నోట్లో బాక్టీరియా పెరగకుండా కాపాడుతుంది. విటమిన్లు, మినరల్స్ ఉన్న ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి. మొలకెత్తిన గింజలు, తృణ ధాన్యాలు తీసుకోవడం ఉత్తమం.

దంతాక్షయం రాకుండా ఉండడానికి పౌష్టికాహారమే కాకుండా కొన్ని జాగ్రత్తలు కూడా పాటించాలి. రోజుకు రెండు నిమిషాల పాటు బ్రష్ చేసుకోవాలి. దంతాల నలుమూలల శుభ్రం చేసుకోవాలి. దంత సమస్యలు ఉన్నా లేకున్నా ఎక్కువ కాలం టూత్ బ్రష్ వాడకూడదు. కనీసం 6 నెలలకు ఒకసారైనా మార్చుతూ ఉండాలి. సైజ్ ను భట్టి టూత్ బ్రష్ ను ఏర్పాటు చేసుకోవాలి. టూత్ బ్రష్ బ్రిజిల్స్ కు క్యాప్ పెట్టరాదు. ఇలా పెట్టడం వల్ల అందులో బాక్టీరియా చేరి నిల్వ ఉంటుంది. సాధ్యమైనంత వరకు టాయిలెట్ కు దూరంగా టూత్ బ్రష్ ఉండేలా సెట్ చేసుకోవాలి.

మార్కెట్లో దొరికే రకరకాల పేస్టులతో కూడా దంతాక్షం రావొచ్చు. అందువల్ల నాణ్యమైన పేస్టును వాడాలి. మార్కెట్లో దొరికే పేస్ట్ వద్దనుకుంటే ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. 4 స్పూన్ల కాల్షియం పౌడర్, ఒక టేబుల్ స్పూన్ స్టీవియా, ఒక టేబుల్ స్పూన్ సముద్ర ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల బేకింగ్ సోడా, అర కప్పు కోకోనట్ ఆయిల్ ను తీసుకొని మిక్స్ చేయాలి. ఇలా తయారైన దానిని నెల లోపు మాత్రమే వాడుకోవాలి. బయట దొరికే పేస్టు కన్నా ఇది మెరుగ్గా పనిచేస్తుంది. ఇలా కొన్ని ప్రత్యేక చిట్కాలు పాటించి దంతాక్షయానికి దూరంగా ఉండండి..

Leave a Comment