Thyroid : థైరాయిడ్ తో బాధపడుతున్నారా..: ఈ చిట్కాలతో చెక్ పెట్టండి..

manaarogyam

మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లతో మనుషులు అనేక వ్యాధులకు గురవుతున్నారు. ఈరోజుల్లో చాలా మంది థైరాయిడ్ తో బాధపడేవారు ఎక్కువే ఉన్నారు. థైరాయిడ్ నుంచి హైపో థైరాయిడ్ స్థాయికి మారితే వైద్యుల వద్దకు వెళ్లి చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. అయితే థైరాయిడ్ స్థాయిలో ఉన్న వాళ్లు మెడిసిన్ తో పాటు కొన్ని ఇంటి చిట్కాలు పాటించడం వల్ల సమస్య తీవ్రతను తగ్గించవచ్చు. అందుకు పెద్దగా ఖర్చు చేయకుండా ఇంట్లో లభించే వాటితోనే చేసుకోవచ్చు. ఇలా తయారు చేసిన వాటిని క్రమ పద్ధతిలో తీసుకోవాలి. ఆ చిట్కాల గురించి తెలుసుకుందాం..

థైరాయిడ్ సమస్యతో బాధపడేవారు విటమిన్ బి ఉండే ఆహారాలను తీసుకోవాలి. కూరగాయలు, ధాన్యాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల విటమిన్లు లభిస్తాయి. విటమిన్ ఏ ఎక్కువగా ఉండే వాటిని..అంటే క్యారెట్, గుమ్మడి, కోడిగుడ్టుతో పాటు యాంటీ ఆక్సిడెంట్లు లభించే వాటిని తీసుకోవాలి. అలాగే కూరగాయలను ఎక్కువగా తినలేని వారు జ్యూస్ ఎక్కువగా తీసుకోవాలి. క్యారెట్, బీట్ రూట్, పైనాపిల్ జ్యూస్ తీసుకుంటే ఫలితం ఉంటుంది. ఒక జార్ లో గ్రీన్ యాపిల్, బీట్ రూట్, పైనాపిల్ ముక్కలను వేసి కొంచెం నీరు కలపాలి. ఆ తరువాత జ్యూస్ చేసుకొని తాగాలి.

thyroid
thyroid

హైపో థైరాయిడిజం ఉన్నవాళ్లు కొన్ని కూరగాయలకు దూరంగా ఉండాలి. వాటిలో క్యాబేజీ, కాలి ఫ్లవర్, బ్రోకొలి, పాలకూర, సోయాబిన్స్, వేరు శెనగ, కర్రపెండలం, సజ్జలు వంటివాటికి దూరంగా ఉండాలి. హైపో థైరాయిడిజం వల్ల శరీరంలో ఉష్ణోగ్రత తగ్గుతుంది. ఈ స్థాయికి వచ్చినప్పుడు వెంటనే వైద్యులను సంప్రదించాలి. వైద్యుల సూచనలు పాటిస్తూనే ఫుడ్ విషయంలో మాత్రం జాగ్రత్తగా మెనూ పాటించాలి.

థైరాయిడ్ సమస్యతో భాధపడేవారు వంటింట్లో ఉండే పదార్థాలను కూడా ఉపయోగించవచ్చు. ఇంట్లో నిత్యం ఉండే ధనియాలను కాషాయంగా చేసుకొని తాగాలి. ఒక గిన్నెలో రెండు గ్లాసుల నీటిని పోసి వేడి చేయాలి. ఆ తరువాత నీళ్లు వేడయ్యాక రెండు స్పూన్ల ధనియాలను వేసి మరో 10 నిమిషాలు మరగబెట్టాలి. ఆ తరువాత ఇందులో రుచి కోసం ఒక టేబుల్ స్పూన్ తేనెను కలపాలి. ఇలా కలిపిన నీటిని రోజుకు రెండు సార్లు తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల హైపో థైరాయిడిజంను తగ్గించడంతో పాటు అధిక బరువు పెరగకుండా ఉంటారు.

Leave a Comment