మంచం మీద నుంచి లేవలేకపోతున్నారా..? దీనిని తాగండి… ఉరుకుతారు..!

manaarogyam

ప్రస్తుతం చాలా మందిలో అనేక రోగాలు ఇమిడి ఉన్నాయి. ఇప్పుడున్న వాతావరణంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. ఏవో కొన్ని వ్యాధులు వెంటాడుతూనే ఉంటున్నాయి. ముఖ్యంగా వయసు మీద పడకుండానే మొకాళ్ల నొప్పులతో చాలా మంది బాధపడుతున్నారు. మనం తీసుకునే ఆహారంలోనే లోపాలు ఉండడంతో ఈ సమస్యలు దాపురించుతున్నాయి. అయితే చాలా మంది మొకాళ్ల నొప్పులు రాగానే మెడికల్ షాపులకు వెళ్లి ఏవేవో మాత్రలు వాడుతుంటారు. కానీ అంతకమంటే ముందు మనకు ఇంట్లో దొరికే పదార్థాలను ఉపయోగించి కూడా మొకాళ్ల నొప్పులను దూరం చేయొచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అదెలాగే చూద్దాం..

అవిసె గింజలు.. ఇవి మార్కెట్లో మనకు కనిపిస్తాయి. కానీ పట్టించుకోం దీనిని ఉపయోగించి కాషాయం చేసుకోవడం ద్వారా మొకాళ్ల నొప్పుల నుంచి దూరం కావచ్చంటున్నారు. ఇందుకోసం అవిస గింజలను మిక్సీలో వేసుకొని పొడి చేసుకోవాలి. అందులో ఒక చెంచా మెంతులు వేయాలి. ఈ రెండింటిని కలిపి మెత్తగా పౌడర్ లా తయారు చేయాలి. ఆ తరువాత ఈ పొడిలో రెండు చెంచాల ఉసిరికాయ పొడి వేసి బాగా కలుపుకోవాలి. అవిసె గింజల్లో ఒమేగా 3 పాటీ ఆసిడ్స్ ఉంటాయి. ఇవి మొకాళ్లు, నడుం నొప్పి, మెడ నొప్పి తగ్గడానికి ఉపకరిస్తాయి. అలాగే మెంతుల్లోనూ యాంటి ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అందువల్ల ఈ రెండింటి మిశ్రమం ఎంతో ఉపకరిస్తుంది.

ఇక కలా గోంధ్ తో కూడా మొకాళ్ల నొప్పులను తగ్గించుకోవచ్చు. ఒక గ్లాసు నీళ్లలో ఒక గ్రామ్ కలా గోంద్ వేయాలి. అది కరిగే వరకు బాగా కలపాలి. ఇది కాస్త చిక్కటి ద్రవంలా మారుతుంది. ఆ తరువాత పైన తయారు చేసిన పౌడర్ ను వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని భోజనం చేసే ముందు తీసుకోవాలి. ఇలా కొద్ది రోజుల పాటు తీసుకుంటే శరీరంలోని అన్ని రకాల నొప్పులను మాయం చేస్తుంది. దీని వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అందువల్ల మొకాళ్ల నొప్పులు, ఇతర పెయిన్స్ తో బాధపడేవారు దీనిని ఉపయోగించవచ్చని అంటున్నారు.

మొకాళ్ల నొప్పులతో మంచానికే పరిమితం అయిన వారు కూడా దీనిని వైద్యుల సలహా మేరకు తీసుకోవచ్చు. అలాంటి వారు సైతం ఈ మిశ్రమాన్ని వారం రోజుల పాటు తీసుకుంటే పురుగెత్తే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. కొందరు మొకాళ్ల నొప్పుల కోసం ఎన్ని టాబ్లెట్లు వాడినా ప్రయోజనం ఉండదు. కానీ ఇది కచ్చితంగా ఫలితాన్ని ఇస్తుందని ఆయుర్వేద వైద్యులు సూచిస్తున్నారు.

Leave a Comment