తల నొప్పి తగ్గాలనుకుంటే ఈ జ్యూస్ తప్పనిసరి..

manaarogyam

ఈరోజుల్లో పని ఒత్తిడి వల్ల చాలా మంది తల నొప్పి తో బాధపడుతున్నారు. అయితే వైద్యుల సలహాలు కేవలం కొంతవరకే అన్నట్లు ఉంటుంది.  కొన్ని రకాల జ్యూస్ లను తాగితే తల నొప్పి తగ్గుతుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. ఇప్పుడు అవేంటో తెలుసుకుందాం..

కొన్నిసార్లు డీహైడ్రేషన్ కారణంగా కూడా తలనొప్పి వస్తుంది. అందుకని ఒక గ్లాసు నిండా చల్లటి నీళ్ళు తీసుకొని తాగితే తక్షణమే తలనొప్పి నుంచి ఉపశమనం అందిస్తుంది. తలనొప్పి తగ్గడానికి క్యారెట్ కీరదోస అద్భుతంగా పనిచేస్తాయి. క్యారెట్ జ్యూస్, కీరదోస జ్యూస్ తాగితే తలనొప్పి నుంచి వెంటనే రిలీఫ్ ఇస్తాయి. లేదంటే నిమ్మకాయ జ్యూస్ ను తయారు చేసుకొని తాగవచ్చు.

ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో కొద్దిగా ఉప్పు నిమ్మరసం వేసుకుని తాగితే తలనొప్పి నుంచి స్వాంతన లభిస్తుంది. మైగ్రేయిన్ తలనొప్పితో బాధపడుతూ ఉంటే నిమ్మరసం తాగితే మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి. ఆహారం విషయం లో మంచి మెలుకువలు తీసుకోవాలి.. ఇలాంటి వాటి వల్ల తల నొప్పి తగ్గుతుందని అంటున్నారు.

Leave a Comment