ఈ పాల తో జలుబుకు చెక్..ఎలా చేయాలంటే?

manaarogyam

వింటర్ వచ్చిందంటే జనాల్లొ భయం కూడా పుడుతుంది. ఎంత జాగ్రత్తలు తీసుకున్నా కూడా అనారొగ్య సమస్యలు భాదిస్తాయి. వాటి నుంచి బయట పడాలంటే ఎన్నో జిమ్మిక్కులు చేయాలి. అలా శ్రమ పడకుండా చాలా సింపుల్ గా జలుబు దగ్గును తగ్గించ వచ్చును..ఈ మెడిసిన్ ఏంటి? ఎలా చేసుకోవాలి అనేది చూద్దాం..

వెల్లుల్లి పాలు తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: 200 మిలీ ఆవు పాలు, అర గ్లాసు నీరు, 7 వెల్లుల్లి రెబ్బలు, పావు టీస్పూన్ పసుపు పొడి, పావు టీస్పూన్ మిరియాల పొడి, పంచదార కొద్దిగా..

తయారి.. ముందుగా పాలలో నీటిని కలిపి బాగా మరిగించాలి. వెల్లుల్లి రెబ్బలను తొక్క తీసి, పాలలో వేసి ఉడికించాలి. వెల్లుల్లి రెబ్బలు ఉడికిన తర్వాత దాన్ని తీసి పసుపు, మిరియాలపొడి వేసి కలపాలి. మీ రుచికి సరిపడా షుగర్ వేసుకోండి.. వెల్లుల్లి పాలు రెడీ..

వెల్లుల్లి పాలను ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు త్రాగండి. రాత్రి భోజనం చేసిన గంట తర్వాత ఈ పాలు తాగండి.. పిల్లలకు మాత్రం రోజూ ఇవ్వకండి..

Leave a Comment