వెల్లుల్లి టీ తో ఆ సమస్యలు దూరం..

manaarogyam

వెల్లుల్లి అంటే కొంత మంది భయపడుతున్నారు.. ఘాటుగా ఉంటుంది.. ఎలా తింటారు అని. అటువంటి వెల్లుల్లి తో అదరహో అనిపించే ఆరోగ్యం దాగి ఉందని నిపుణులు అంటున్నారు..ఆలస్యం లేకుండా అదేమిటో ఒకసారి తెలుసుకుందాం..

గుండె జబ్బులు, క్యాన్సర్ , ఇతర ఇన్ఫెక్షన్ల వంటి సమస్యలతో బాధపడేవారికి వెల్లుల్లి ఎంతో ప్రయోజనకరమని చెప్పవచ్చు. ఈ విధంగా ఎన్నో ఔషధ గుణాలు కలిగినటువంటి వెల్లుల్లితో టీ తయారు చేసుకొని తాగడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని పెద్దలు తెలియజేస్తున్నారు. సాధారణ టీ కన్నా, వెల్లుల్లి టీని తాగడం వల్ల మెటబాలిజం రేటు పెరుగుతుంది. అంతేకాదు శరీరంలోని వ్యర్థాలను వెల్లుల్లి బయటకు పంపిస్తుంది. అంతేకాదు ఉదర సమస్యలను కూడా తగ్గిస్తుందని నిపుణులు అంటున్నారు..

ఈ టీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..

ఒక పాత్ర తీసుకొని.. దాంట్లో కాసిన్ని నీళ్లు పోసి.. బాగా మరిగించండి. ఆ తర్వాత ఆ నీటిలో చిన్న అల్లం ముక్క వేయండి. అల్లాన్ని దంచి వేసినా పర్లేదు. ఇక.. తర్వాత వెల్లుల్లిని తీసుకొని.. వెల్లుల్లి రెబ్బలను బాగా నలపండి. నల్ల మిరియాల పొడిని కొంచెం తీసుకొండి. ఆ నీటిలో మెత్తగా చేసిన వెల్లుల్లి రెబ్బలు, నల్ల మిరియాల పొడిని వేసి అలాగే కాసేపు మరగనివ్వండి.అవి కాస్త చల్లారిన తర్వాత తాగితే చాలా మంచిది. టెస్ట్ కావాలని అనుకునేవాల్లు కాస్త తెనెను కూడా యాడ్ చేసుకొవచ్చు.. రోజు తాగితే మంచి ఫలితం ఉంటుంది..

Leave a Comment