గోడ కుర్చీ వేస్తే శరీరానికి ఎంత మేలో తెలుసా..?

manaarogyam

గోడ కుర్చీ అనేది చిన్నప్పుడు స్కూల్స్ లో విని ఉంటారు. మళ్ళీ ఇప్పుడు వినడం ఆశ్చర్యంగా వున్నా కూడా దీని వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయొజనాలు ఉన్నాయట.. ఏ సమయంలో వేస్తే మంచి ఫలితం ఉంటుంది అనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

ప్రస్తుతం ఎవరి నోట విన్నా ఒకటే మాట.. ఒత్తిడి.. ఈ ఒత్తిడి నుంచి బయట పడటానికి ఐదు నిమిషాలు గోడ కుర్చీ వేసుకుంటే బావుంటుందని నిపుణులు సలహా ఇస్తున్నారు.పొట్ట చుట్టూ కొవ్వుతో ఇబ్బంది పడే వారు.. రెగ్యులర్‌గా గోడ కుర్చీ వేయాలి. తద్వారా పొట్ట వద్ద ఉండే కండరాలు దృఢంగా మారి కొవ్వు క్రమ క్రమంగా కరుగుతూ ఉంటుంది. వెన్ను నొప్పితో బాధ పడే వారికి కూడా గోడ కుర్చీ వ్యాయామం బాగా పనికొస్తుంది.

మీకు వీలైనప్పుడు ఇలా గోడ కుర్చీ వెయ్యడం ద్వారా మంచి ఆరోగ్యం మీ సొంతం..గుండె సమస్యలు తగ్గి పోయి ఆరోగ్యంగా ఉంటుంది.కాళ్లలో ఉండే కండరాలు దృఢంగా మారి పిక్కలు గట్టి పడతాయి. శరీరంలో క్యాలరీలు సైతం కరుగుతాయి. పెద్ద ఆసనాల తో కష్ట పడటం కన్నా ఇలా ఐదు నిముషాలు ఉంటే మంచి ఆరోగ్యం ఉంటుంది..

Leave a Comment