గోంగూర తో గంపెడు లాభాలు..

manaarogyam

గోంగూర ఈ పేరు వినగానే చాలా మందికి నోరు ఊరుతుంది కదూ..అంతే ఎక్కువ ఆరోగ్య ప్రయొజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.ముఖ్యంగా ఇందులో ఐరన్ శాతం ఎక్కువగా వుంటుంది.అందుకే వెజ్ నాన్ వెజ్ అని తేడా లేకుండా ప్రతి వంటలో వీటిని వాడుతుంటారు. మంచి రుచి తో పాటుగా,మంచి ఆరోగ్యం కూడా ఉంటుంది. అసలు గోంగూరను తీసుకోవడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

గోంగూరలో పొటాషియం, ఇనుము, ఫైబర్‌, క్యాల్షియం లాంటి ఖనిజ లవణాలు పుష్కలంగా లభ్యమవుతాయి. ఇవి గుండె జబ్బులు రాకుండా రక్షిస్తాయి. రక్త ప్రసరణ సక్రమంగా జరిగేలా చేయడంతో పాటు రక్తపోటు అదుపులో ఉండేలా చేస్తాయి. అలాగే గోంగూర లో ఉండే క్యాల్షియం ఎముకలను దృఢంగా మారేలా చేస్తాయి. మధుమేహం సమస్య తో బాధపడేవారు గోంగూర తింటే చాలా మంచిదంటారు. ఇమ్మ్యునిటిని పెంచుతుంది. బరువును కూడా తగ్గిస్తుంది.అందుకే డైట్ లో చేర్చు కోవడం మంచిది..

Leave a Comment