ఈజీగా బరువును తగ్గించే సూప్ ఇదే..

manaarogyam

బరువును తగ్గాలనుకునే వారికి ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి.అన్నిటికన్నా కొన్ని రకాల సూప్ లను తీసుకుంటే ఇట్టే బరువును తగ్గుతారని న్యూట్రిషన్లు చెబుతున్నారు.అందులో కూడా పుదీనా గ్రీన్ పీస్ తో చేసిన సూప్ తాగితే అధిక కొవ్వు కరుగుతుందని నిపుణులు అంటున్నారు.. ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..

కావలసిన పదార్థాలు..

పచ్చిబఠానీలు- 2 కప్పులు
బట్టర్- 1 స్పూన్
ఉప్పు : రుచికి సరిపడా
నీళ్ళు- 2 కప్పులు
ఉల్లిపాయలు- ¼ కప్పు
పాలు- ½ కప్పు
ఫ్రెష్ గా ఉండే పుదీనా ఆకులు- 1 స్పూన్
మిరియాల పొడి – ½ స్పూన్

తయారీ విధానం

పాన్ పొయ్యి మీద పెట్టి నూనె వేసి ఉల్లిపాయ ముక్కలను గోల్డ్ కలర్ వచ్చే వరకు వేగించాలి.
ఆ తర్వాత అందులో పచ్చిబఠానీలు, నీళ్ళు పోసి కలపాలి. అందులో ఉప్పు వేయడం మాత్రం మర్చిపోకూడదు. బఠానీలు మెత్తగా ఉడికే వరకూ ఉడికించాలి.పచ్చిబఠానీలు మెత్తగా ఉడికిన తర్వాత పొయ్యి మీద నుండి క్రిందికి దింపుకుని, చల్లారిన తర్వాత మెత్తని పేస్ట్ చేయాలి. ఇప్పుడు మరో పాన్ పెట్టుకొని పాలు, నీళ్ళు, బఠాణిల పేస్ట్ వేసి మరిగించాలి.ఇందులోనే పెప్పర్, పుదీనా ఆకులను వేసి మొత్తం మిశ్రమాన్ని బాగా కలపాలి. ఆ మిశ్రమం మంచి అరోమా వాసన వచ్చే వరకు తక్కువ మంట మీద ఉడికించాలి. అంతే సూప్ రెడీ.. హెల్త్ కు చాలా మంచిది. కాబట్టి మీరు కూడా ట్రై చెయ్యండి.

Leave a Comment