పల్లీలు బరువును తగ్గిస్తాయా?ఎలా?

manaarogyam

ఇప్పుడు ఆహరపు అలవాట్లు పూర్తిగా మారిపోయింది. ఏది తిన్నా అధిక బరువు పెరగడం, లేదు అనారొగ్య సమస్యలు రావడం జరుగుతుంది.ఆడ, మగ తో సంభందం లేకుండా ప్రతి ఒక్కరూ ఈ బరువును తగ్గించె పనిలో ఉన్నారు.స్లిమ్‌గా మారాలని చేసే ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావనే చెప్పాలి. అయితే బరువు తగ్గాలి అని ప్రయత్నించే వారు ఖచ్చితంగా తమ డైట్‌లో కొన్ని పల్లీలు చేర్చుకోవాలని ఆరోగ్య నిపుణులు సలహా ఇస్తున్నారు.

మిగిలిన పప్పుల తో పోలిస్తే పల్లీలు తక్కువ క్యాలరీలు..అలాగే పల్లీలను స్నాక్స్‌గా తీసుకోవడం వల్ల ఎక్కువ సమయం పాటు కడుపు నిండిన భావన కలుగుతుంది. దీంతో వేరే ఆహార పదార్థాలను తీసుకోలేరు. తద్వారా అధిక బరువుకు చెక్ పెట్టవచ్చు..ముఖ్యంగా ఒత్తిడిని దూరం చేస్తాయి..జీర్ణ సమస్యలు దూరం అవుతాయి. కె, ఈ, బీ విటమిన్లు పుష్కలంగా ఉండే పల్లీలు ప్రతి రోజు తీసుకోవడం వల్ల జ్ఞాపకశక్తి రెట్టింపవుతుంది.అంతేకాదు క్యాన్సర్ నివారిణిగా కూడా పని చేస్తుంది. ముఖ్యంగా పల్లీల్లో ఉండే ఫ్యాలీ ఫినోల్ యాక్సిడెంట్స్ స్టొమక్ క్యాన్సర్ వచ్చే రిస్క్ తగ్గుతుంది. పల్లీల్లో క్యాల్షియం మరియు విటమిన్ డి కూడా దొరుకుతుంది… వీటి వల్ల ఎముకలు బలంగా తయారు అవుతాయి.అందుకే ఇకమీదట ఎక్కడైనా పల్లీలు దొరికితే వద్దనకుందా తినండి..

Leave a Comment