ఆహరపు అలవాట్లు మారడంతో అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి.అందులో నరాల బలహీనత కూడా ఒకటి..ఈ సమస్య ఏర్పడటానికి చాలా కారణాలే ఉన్నాయి. నరాల పటుత్వం కోల్పోయిన ఏ పని చేయలేకపోతుంటారు.నరాల బలహీనతను నివారించడంలో జామపండ్లు అంద్బుతంగా సహాయపడతాయి. సాధారణంగా పిల్లల నుంచి పెద్దల వరకు జామపండ్లను ఎంతో ఇష్టంగా తింటుంటారు. వీటి వాసనకే తినాలని అనిపిస్తుంది.
వీటిలో ఎన్నో ఆరోగ్య ప్రయొజనాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు..ఈ సమస్య ఉన్న వాళ్ళు రోజు జామ కాయను తినడం లేదా..జ్యూస్‌ను తీసుకోవడం వల్ల ఈ సమస్య తగ్గుతుంది.అంతేకాదు కండరాల బలహీనత కూడా తగ్గుతుంది.మధుమేహం రోగులు జామపండు తింటే.. బ్లడ్ షుగర్ లెవల్స్ ఎప్పుడు అదుపులో ఉంటాయి. జామలో ఉండే విటమిన్ సి.. శరీర రోగ నిరోధక శక్తిని బలపరుస్తుంది.వీటిని తీసుకోవడం వల్ల పొట్ట నిండిన భావన కలుగుతుంది.దాంతో అధిక బరువును తగ్గించవచ్చును.