ఈ ఆకురసం 7 రోజుల్లో తెల్లజుట్టును నల్లగా మార్చేస్తుంది..: ఎలాగో చూడండి..

గ్రామాల్లో, పట్టణాల్లో చాలా మంది ఇళ్లలో జామ చెట్టును మనం చూస్తూనే ఉంటాం. విరగబూసిన జామకాయలను విడిచిపెట్టకుండా తింటాం. జామకాయలో సీ విటమిన్ అధికంగా ఉంటుంది. జామకాయలు తినడం వల్ల ఆనేక ఆరోగ్య సమస్యల నుంచి బయటపడొచ్చు. అయితే జామ ఆకులతో కూడా అనేక ప్రయోజనాలున్నాయి. జామకాయ వరకే తెలుసుకున్న జామ ఆకులతో కూడా ఆరోగ్య ప్రయోజనాలున్నాయన్న విషయం తెలుసుకొని ఆశ్చర్యపోతున్నారు. ఇవి తెల్లగా మారిన జుట్టును నల్లగా మార్చేయగలవని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అదెలాగో చూద్దాం..

జామ ఆకులు సరైన రక్త ప్రవాహాన్ని ప్రేరేపించడంలో సహాయపడుతాయి. ఇందులో అనేక ముఖ్యమైన పోషకాలు ఉన్నాయి. ఈ క్రమంలో రంగుమారిన జుట్టును నల్లగా మార్చడానికి జామ ఆకులు ఎంతో ఉపకరిస్తాయి.జామ ఆకులలో లభించే పోషకాలు వర్ణద్రవ్యం మెలనిన్ ఉత్పత్తని పెంచి జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుంది. కొందరు జుట్టు రంగు పోవడానికి జన్యులోపం అని అంటారు. కానీ ఇలాంటి వాటిని కూడా జామ ఆకులను ఉపయోగించి జుట్టును నల్లగా మార్చుకోవచ్చని అంటున్నారు.

అయితే జామ ఆకులను ఏ విధంగా ఉపయోగించడం వల్ల తెల్లజుట్టు నల్లగా మారుతుంది. అందుకోసం ఏం చేయాలి..? ముందుగా జామ ఆకులను వెచ్చని నీటిలో ఒకటి నుంచి రెండు గంటల పాటు నానబెట్టాలి. ఆ తరువాత దానిని పేస్ట్ వచ్చేలా రుద్దాలి. ఈ పేస్టును జుట్టుపై అప్లై చేయాలి. అలా పెట్టిన తరువాత కనీసం రెండు గంటల పాటు ఆరనివ్వాలి. ఈ పేస్టు ఆరే వరకు వెయిడ్ చేయడం చాలా అవసరం. ఆ తరువాత తేలికపాటి షాంపుతో తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే సరైన ఫలితం ఉంటుంది.

జామ ఆకుల్లో విటమిన్ సీ పుష్కలంగా ఉంటుంది. ఇది జుట్టు పెరుగుదలకు ఎంతో ఉపకరిస్తుంది. జామ ఆకుల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు జుట్టును దెబ్బతీసే ఫ్రీ రాడికల్స్ కు వ్యతిరేకంగా పోరాడుతుంది. తద్వారా జుట్టు దెబ్బతినకుండా కాపాడుతుంది. జామ ఆకుల్లో సూర్యుని నుంచి వెలువడే అతి నీలలోహిత కిరణాలు తట్టుకునే శక్తి ఉంటుంది. దీనిని జుట్టుకు రాసుకోవడం వల్ల జుట్టుకు హాని కలగకుండా కాపాడుతుంది. అంతేకాకుండా జుట్టు నుంచి ధూళి, అనేక మలినాలను తొలగించడంలో సహాయపడుతుంది.

WordPress › Error

There has been a critical error on this website.

Learn more about troubleshooting WordPress.