జుట్టు రాలే సమస్యకు ఉసిరి మంచి మెడిసిన్..

manaarogyam

ఉసిరి అంటే పొషకాల పొదరిల్లు.. ఎన్నో రకాల సమస్యలను నయం చెస్తుంది..ముఖ్యంగా జుట్టు సమస్యలను తగ్గిస్తుంది. అలాగే జుట్టు పెరగడానికి దోహదపడుతుంది..ఉసిరిలో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ ఉండుట వలన జుట్టు కుదుళ్ళ నుండి రిపేర్ చేయటంలో సహాయపడుతుంది. అయితే ఉసిరిని ఎలా వాడితే ఎక్కువ ప్రయోజనం ఉంటుందో వివరంగా తెలుసుకుందాం. ఉసిరితో ఒక ప్యాక్ తయారుచేసుకోవాలి. వీటికి కావలసిన పదార్ధాల గురించి తెలుసుకుందాం.

కావలసిన పదార్థాలు..

ఉసిరి పొడి – 1 టీస్పూన్ కుంకుడుకాయ పొడి – 1 టీస్పూన్ కర్పూరం పొడి – 1/4 వ టీస్పూన్ రోజ్ వాటర్ – 3 స్పూన్స్

తయారీ విధానం ..

ఒక బౌల్ లో ఉసిరి పొడి, కుంకుడు కాయ పొడి, కర్పూరం పొడి, రోజ్ వాటర్ వేసి బాగా కలపాలి. ఈ పేస్ట్ ని తలకు బాగా పట్టించి 5 నిమిషాల పాటు మసాజ్ చేసి పావుగంట తర్వాత గోరువెచ్చని నీటితో తేలికపాటి షాంపూతో తలస్నానము చేయాలి. ఈ విధంగా వారానికి రెండు సార్లు చేస్తే మంచి ఫలితం వస్తుంది.. మీరు కూడా ట్రై చేయండి..

Leave a Comment