న్యూయర్ వేడుకల్లో ఎక్కువగా తాగడం యువత చెస్తుంది.రోజూ తాగడం కన్నా కాస్త ఎక్కువగా తాగడం చేస్తారు.పార్టీలో వినోదం కోసం మద్యం సేవించడం చేస్తారు. కానీ దీని తర్వాత హ్యాంగోవర్ చాలా మందిని ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది.
పార్టీ సమయంలో ఎక్కువగా ఆల్కహాల్ తీసుకోవడం వల్ల శరీరంపై ప్రభావం చూపుతుంది, దీని కారణంగా అలసట, బద్ధకం, డీహైడ్రేషన్, వికారం, తలనొప్పి, కండరాలు పట్టేయడం వంటి సమస్యలు ఉంటాయి.. వెంటనే తల నొప్పి తగ్గేందుకు కొన్ని చిట్కాలు ఉన్నాయి అవేంటో ఇప్పుడు ఒకసారి చూద్దాం..
హ్యాంగోవర్ కారణంగా వాంతులు చేసుకుంటే దానిని ఆపడానికి నిమ్మకాయ తీసుకోండి. వాంతులు ఆగినప్పుడు కొబ్బరి నీళ్లు తాగండి. దీంతో శరీరంలో నీటి కొరత త్వరగా తీరుతుంది.
హ్యాంగోవర్‌ను వదిలించుకోవాలనుకుంటే ఉదయాన్నే నిద్రలేచిన తర్వాత పుష్కలంగా నీరు తాగాలి. ఆల్కహాల్ వల్ల శరీరంలో డీహైడ్రేషన్ సమస్య వస్తుంది.వీటితో పాటుగా తేనే అల్లం టీ, నిమ్మరసం పెరుగు తీసుకున్నా కూడా చాలా మంచిది.