రాత్రిళ్ళు పెరుగును తింటున్నారా? ఇవి ఒకసారి చూడండి..

manaarogyam

కాల్షియం, మెగ్నీషయం వంటివి శరీరానికి అందాలంటే పాలు, పాల సంబంధిత పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలని వైద్యులు అంటున్నారు. వీటి వల్ల ఎముకలు బలంగా మారుతాయి.. అందుకే చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ల వరకు అందరూ ఈ పాల పదార్థాలను తీసుకుంటారు. ముఖ్యంగా శాకాహారులకి మిల్క్ ప్రొడెక్ట్స్ చాలా మంచిది వారి ఆరోగ్యానికి కావలసిన అన్నీ పొషకాలు పాల నుంచి లభిస్తాయి.. అయితే రాత్రి పూట పెరుగు తీసుకోవడం వల్ల జలుబు చేస్తుందని, గుండె జబ్బులు కూడా వస్తాయని ఇటీవల జరిపిన అధ్యయనాల్లో తేల్చి చెప్పారు.

ఎలాంటి వారైనా రాత్రి పూట పెరుగు తీసుకోవచ్చని, వీటిని తీసుకోవడం వల్ల అదనపు లాభాలు ఉంటాయని, చక్కగా నిద్రపడుతుందని వైద్యులు చెబుతున్నారు. అయితే గడ్డ పెరుగులా కాకుండా కొద్దిగా నీళ్లను  వేసుకొని  పలుచగా చేసుకోవాలని సూచిస్తున్నారు. పెరుగు మరీ చల్లగా, ఫ్రిజ్‌లో పెట్టింది కాకుండా సాధారణ ఉష్ణోగ్రత ఉండేలా చూసుకోవాలి అప్పుడే మన శరీరానికి మంచి లాభాలు ఉంటాయి.. చూసారుగా ఇన్ని ప్రయోజనాలు ఉన్న ఈ పెరుగును స్కిప్ చేయడం మానేసి హాయిగా తినండి ఆరోగ్యాన్ని పెంచుకోండి.. ఏదైనా కూడా లిమిట్ లో తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎటువంటి డోకా ఉండదు.. అతిగా తింటేనే అనర్థాలు జరుగుతాయి.

Leave a Comment