ఈ మొక్క పోషకాలకు పుట్టినిల్లు..ఎన్ని ప్రయోజనాలో..

మనకు ఆరోగ్యాన్ని ఇచ్చే ఎన్నో మొక్కలు మనకు తెలియదు. కొన్ని ప్రాంతాల్లొ ఉన్న ఔషద మొక్కలను కొన్ని ప్రాంతంలోని వాళ్ళు చూసి ఉండరు. అటువంటి అద్భుతమైన గుణాలను కలిగి ఉన్న మొక్కల లో ఒకటి గంగ వాయల ఆకు..ఈ ఆకులను ఒక్కో విధమైన పేర్ల తో పిలుస్తారు.ఈ ఆకుల వల్ల ఎన్ని ప్రయొజనాలు ఉన్నాయో తెలిస్తే అస్సలు వదలరు.. అవేంటో ఒకసారి చూసేద్దాం..

వీటిలో విటమిన్ ఏ, బి, కార్బోహైడ్రేట్స్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, పొటాషియం, కాల్షియం, ఐరన్ సమృద్ధిగా లభిస్తాయి. ఈ ఆకు ను కూర, పప్పు గా వండుకుని తినవచ్చు. ఇందులో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇందులో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ ను తొలగిస్తుంది.గుండె ఆరోగ్యాన్ని పెంచుకునేందుకు సహాయపడుతుంది.

ఇందులో విటమిన్ ఏ కంటి సమస్యలు రాకుండా చేస్తుంది. ఈ ఆకు లో ఉండే పీచు పదార్థం జీర్ణ క్రియను మెరుగు పరుస్తుంది. జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తకుండా చేస్తుంది. బరువు తగ్గాలనుకునే వారికి ఈ ఆకుల కూర తింటే మెరుగైన ఫలితాలు కలుగుతాయి. వీటి ఆకుల రసాన్ని పుండ్లు, గాయలను  తగ్గిస్తాయి..

WordPress › Error

There has been a critical error on this website.

Learn more about troubleshooting WordPress.