వేప లో ఎంత చేదు ఉందో అంతకు మించి ఆరోగ్యం కూడా ఉంది.వేప ఆకులు, పువ్వులు, విత్తనాలు, పండ్లు, వేర్లు బెరడు అన్ని మన ఆరోగ్యానికి మేలు చేస్తాయి..అందుకే ఆయుర్వేదం లో వేప కు పేత్యెక స్థానం ఉంది.మన శరీరానికి అవసరమైన ప్రోటీన్లు, కొవ్వులు కార్బోహైడ్రేట్స్ సమృద్ధిగా లభిస్తాయి. వేపాకులు యాంటీ ఫంగల్ గుణాలను కలిగి ఉంది. ఇది ఫంగల్ ఇన్ఫెక్షన్ ను దూరం చేస్తుంది. రక్తాన్ని శుద్ధి చేస్తాయి. రక్తంలోని విష వ్యర్ధాలను తొలగిస్తుంది.
రోజూ ఉదయం నాలుగు వేప ఆకులను తినడం వల్ల కొన్ని రకాల క్యాన్సర్ లు రాకుండా ఉంటాయి.వేప ఆకులను ముద్దగా నూరి తామర, గజ్జి , దురద ఉన్నచోట రాస్తే త్వరగా తగ్గుతుంది. అన్ని రకాల చర్మ సమస్యలు ను తగ్గించడానికి వేప నూనె సహాయపడుతుంది. జలుబుతో ఇబ్బంది పడుతుంటే వేడి వేడి నీటిలో వేప ఆకులు వేసి మరిగించి ఆ నీటితో ఆవిరి పడితే వెంటనే ఉపశమనం లభిస్తుంది.. రోజు స్నానంచేసే నీటిలో వేప ఆకులను వేసి చేస్తె చర్మ సమస్యలు దరిచెరవు..