ఇమ్మ్యునిటి పెంచే వాము సూప్..

manaarogyam

వంటిల్లు ఒక వైద్య శాల ఎన్నో రొగాలను నయం చేసే మందులు ఈ గదిలో నిక్షిప్తమై ఉన్నాయి.అందులో వాము ఒకటి. దీన్ని వంట లకు తక్కువగా వాడుతుంటారు..ఎన్నో సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది.. వాము జీర్ణశక్తి పనితీరు ను మెరుగుపరచడానికి ఉపయోగ పడుతుంది..

వామును, అల్లం, మిరియాలు, నల్ల జీలకర్ర, మెంతులతో కలిపి తీసుకుంటే మంచి ఫలితం ఉంటుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. వాముతో సూప్‌ తయారు చేసుకుని తీసుకోవచ్చు. అందుకోసం కావలసినవి,తయారీ విధానం ఒకసారి చూసేద్దాం..

కావలసినవి:

వాము – రెండు టేబుల్‌స్పూన్లు, నల్లజీలకర్ర – అర టీస్పూన్‌, మెంతులు – అర టీస్పూన్‌, బిర్యానీ ఆకు – ఒకటి, నెయ్యి – రెండు టేబుల్‌స్పూన్లు, వెల్లుల్లి రెబ్బలు – ఐదారు, అల్లం – చిన్నముక్క, మిరియాలు – ఐదారు, ఉల్లిపాయ – ఒకటి, పసుపు – చిటికెడు, ఉప్పు -సరిపడా

తయారి విధానం:
వామును నానబెట్టాలి.అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయలు, మిరియాలను గ్రైండర్‌లో వేసి పేస్టులా పట్టుకోవాలి. ఆ తరువాత నానబెట్టుకున్న వాము, తగినంత ఉప్పు వేసి మరోసారి గ్రైండ్‌ చేసుకోవాలి.తర్వాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని నెయ్యి వేసి కాస్త వేడి అయ్యాక బిర్యానీ ఆకు, జీలకర్ర, మెంతులు వేసి వేయించాలి.తరువాత గ్రైండ్‌ చేసి పెట్టుకున్న పేస్టు వేయాలి. కొద్దిగా పసుపు వేయాలి.తర్వాత గ్లాసు లోకి తీసుకొని సెర్వ్ చేసుకుంటే సరి..

Leave a Comment