ఉదయాన్నే గుప్పెడు శనగలను తీసుకుంటే ఎన్నో లాభాలున్నాయి..

ఉదయాన్నే ఆయిల్ ఫుడ్స్ కాకుండా తృణ ధాన్యాలను తీసుకోవడం చాలా మంచిదని నిపుణులు అంటున్నారు.. వీటి వల్ల పొట్ట నిండిన అనుభూతి కలుగుతుంది. అందుకే మనం ఎక్కువ ఆహారాన్ని తీసుకొలెము..ముఖ్యంగా శనగలు, పెసలను తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. శనగలు తీసుకుంటే ఎటువంటి ప్రయోజనాలు దాగున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

రాత్రి శనగలు నీళ్లల్లో నానబెట్టి ఉదయాన్నే వాటిని తింటే చాలా మంచిది. అయితే అతిగా తీసుకోవడం వల్ల కడుపు నొప్పి మొదలైన సమస్యలు వస్తాయి. ఆరోగ్య నిపుణులు చెబుతున్న దాని ప్రకారం శనగలలో పోషక పదార్ధాలు ఎక్కువగా ఉంటాయి. దాని ద్వారా ఎన్నో రోగాలు నయం అవుతాయని గుర్తుపెట్టుకోండి…

కొవ్వును కరిగిస్తుంది..

కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గించడానికి కూడా ఉపయోగపడుతాయి. దీనితో హృదయ సంబంధిత సమస్యలు కూడా ఉండవు. అందుకే శనగలు చాలా మంచివి.

వీటిని తీసుకోవడం వల్ల ఎక్కువ ప్రొటీన్లు అందుతాయి. అదేవిధంగా ఎనీమియా సమస్యతో బాధపడే వాళ్ళు ప్రతిరోజు శనగలని తీసుకుంటే మంచిది..వీటిలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది.అంతేకాదు నీరసాన్ని కూడా ఇవి తగ్గిస్తాయి.. తిన్న ఆహారాన్ని జీర్ణమయ్యెలా చేస్తుంది. ఫైబర్ పుష్కలంగా ఉంటుంది..నానబెట్టిన శనగలను కాకుండా మొలకలు కూడా ఆరోగ్యానికి మంచిది.. పెసల లో కూడా ఇంచుమించు ఒకే పోషకాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు..

WordPress › Error

There has been a critical error on this website.

Learn more about troubleshooting WordPress.