గోంగూర.. భారతీయులు ఎక్కువగా చేసుకొనే కూరలలో ఒకటి.. అందుకే చాలా మందికి
గోంగూర పేరు వినగానే నీళ్ళు ఊరతాయి..గోంగూరలో పొటాషియం, ఐరన్ లాంటి లవణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో చక్కర స్థాయిని తగ్గించి షుగర్ రాకుండా చేస్తాయి. అంతేకాదు రక్తపోటును అదుపులో ఉంచుతుంది.
గోంగూరలో విటమిన్ ఏ, బి 1, బి 2, బి 9 తోపాటు విటమిన్ సి కూడా సమృద్ధిగా ఉంటుంది. విటమిన్ ఏ కంటి సంబంధిత సమస్యలను రాకుండా చేస్తుంది. రేచీకటిని కూడా రాకుండా చేస్తుంది. అంతేకాదు కాల్షియం సమృద్ధిగా ఉంటుంది. ఎన్నో పొషక విలువలు ఉన్న ఈ గోంగూరను కనీసం వారానికి రెండు సార్లయినా ఆహారంలో చేర్చుకోవడం మంచిది. దీనిలో చాలా తక్కువ కొవ్వు ఉండడం వల్ల బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
మరో విషయం ఏంటంటే.. రక్త పోటు,గుండె, కిడ్నీ సంబంధ సమస్యలు, కాన్సర్ వంటి సమస్యలను కూడా నివారించడంలో మంచి మెడిసిన్. దగ్గు, ఆయాసంతో బాధపడేవారు గోంగూరను తీసుకుంటే మంచిది. గోంగూరను ఎండబెట్టి పొడి చేసి చర్మ సమస్యలు వచ్చినప్పుడు వాటి పై రాసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.గోంగూర పేస్ట్ ను జుట్టు, ముఖానికి రాసుకున్నా అద్బుతమైన ఫలితాలు ఉంటాయని నిపుణులు అంటున్నారు.