మామూలు ద్రాక్షాలను అందరూ ఇష్టంగా తింటారు. ఇక ఎండు ద్రాక్షలను కూడా అంతే ఇష్టంగా తింటారు.వీటిని ఎక్కువగా స్వీట్స్ తయారి లో వాడుతుంటారు.ఎండు ద్రాక్షలో విటమిన్లు , పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ప్రతిరోజు పరగడుపున ఒక గ్లాసు ఎండుద్రాక్ష నీరు తాగితే చాలా ఆరోగ్య సమస్యలు నయమవుతాయని నిపుణులు అంటున్నారు.. అవేంటో ఒకసారి చూద్దాం..
ఉదయాన్నే ఎండుద్రాక్ష నీరు తాగడం వల్ల బరువు తగ్గుతారు. ఎండుద్రాక్షలో ఫ్రక్టోజ్, గ్లూకోజ్ పుష్కలంగాఉంటాయి. ఇవి మిమ్మల్ని శక్తివంతంగా ఉంచుతాయి. వీటిలో ఫైబర్ కూడా ఉంటుంది.. దాంతో చాలా సేపటివరకూ కడుపు నిండుగా ఉంటుంది.
క్యాన్సర్ నివారణ..యాంటీఆక్సిడెంట్లు క్యాన్సర్‌కు కారణమయ్యే ఫ్రీ రాడికల్స్ నుంచి మీ శరీరాన్ని కాపాడుతుంది..
గుండెకు ఆరోగ్యం..శరీరంలోని రక్తాన్ని శుద్ధి చేస్తుంది.చెడు కొలెస్ట్రాల్‌ను తొలగిస్తుంది మీ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో హెల్ప్ చేస్తుంది.ఇంకా కాలెయాన్ని శుద్ధి చేస్తుంది. అంతేకాదు రోగనిరోధక శక్తిని పెంచుతుంది.. అందుకే రోజూ ఉదయం ఒక గ్లాస్ ఎండు ద్రాక్ష నీళ్ళను తాగడం మంచిది..