Bathing: ప్రతి ఒక్కరూ పరిశుభ్రమైన వాతావరనంలో ఉంటేనే ఆరోగ్యంగా ఉండగలుగుతారు. పరిశుభ్రకార్యకలాపాల్లో భాగంగా ప్రతిరోజూ తప్పనిసరిగా స్నానం చేయాలి. ఇప్పుడున్న రోజుల్లో బీజీ లైఫ్ కారణంగా కొందరు స్నానం చేయకుండానే తమ కార్యకలాపాలను కొనసాగిస్తారు. కానీ అపరిశుభ్రంగా ఉంటే మనతో పాటు మన పక్కనున్నవాళ్లకు కూడా నష్టమే కలుగుతుంది. అందువల్ల ప్రతిరోజూ స్నానం చేయడం అలవాటు చేసుకోవాలి. అయితే స్నానం చేసేటప్పడు కొన్ని పద్దతులు పాటించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. పూర్వకాలంలో నదీ లేదా బావి స్నానం చేసేవారు. అలా చేయడం చాలా మంచిది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి అందరికి లేదు. అందువల్ల ఉన్నవాటినే సక్రమంగా వినియోగించుకోవాలి. ఇందుకు ఏం పద్ధతులు పాటించాలో చూద్దాం..
స్నానం చేయడం అంటే శరీరంపై కొన్ని నీళ్లు పోసుకొని ఆ తరువాత ఇంట్లో దూరడం కాదు. దీనికి కూడా క్రమ పద్ధతిని పాటించారు. వీలైనవాళ్లు ఉదయం 4 గంటలకు స్నానం చేస్తే మంచిది. దీనిని ముని స్నానం అంటారు. ఇలా చేయడం వల్ల పాపాలు తొలిగిపోతాయి. 5 నుంచి 6 గంటల మధ్య చేసే స్నానాన్ని దైవ స్నానం అంటారు. 6 నుంచి 7 గంటల మధ్య చేసే స్నానాన్ని మానవ స్నానం అంటారు. ఆ తరువాత కాలంలో చేసే స్నానాన్ని రాక్షస స్నానం అంటారు. అందువల్ల సాధ్యమైనంత వరకు సూర్యోదయానికి ముందే స్నానం చేసే అలవాటు చేసుకోండి.

స్నానం చేసే ముందు కొన్ని పాటించడం వల్ల ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. నిత్య యవ్వనంగా కనిపించాలంటే ఆలివ్ నూనెను వేడిచేసి దీనికి ఒక టీ స్పూన్ తేనెను కలపాలి. ఈ మిశ్రమాన్ని శరీరానికి పట్టించాలి. గులాబి రేకులను వేసి మరిగించిన నీటితో స్నానం చేయడం వల్ల చర్మానికి తగినంత కాంతి అందుతుంది. ఒత్తిడి కూడా దూరమవుతుంది. వేప, పుదీనా, తులసి ఆకులు నీటిలో వేసి స్నానం చేయడం వల్ల చర్మ సమస్యలు దరిచేరవు. సమపాళ్లలో వేడి చేసి కొబ్బరినూనె, ఆలివ్ ఆయిల్ ను తలకు పట్టించాలి. ఇలా చేయడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు.
ఇక స్నానం చేసిన తరువాత కొందరు అపరిశుభ్రంగా ఉంటారు. శరీరంపై ఉన్న నీటిని తూడ్చుకోరు. కానీ అలా చేయడం వల్ల అనేక వ్యాధులు వస్తాయి. ప్రైవేట్ ప్రదేశాల్లో చెమటతో ఎక్కువగా బ్యాక్టిరియా చేరుతుంది. దీంతో అక్కడ శుభ్రం చేసుకున్న తరువాత నీటి బిందువులు లేకుండా శుభ్రంగా తుడుచుకోవాలి. లేకుంటే క్యాన్సర్ వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. పురుషులు శరీరానికి ఏదైటా టవల్ తో స్నానం చేయడం మంచిదని అంటున్నారు.