ప్రస్తుతం ఆహారపు అలవాట్లు పూర్తిగా మారాయి. పూర్వకాలంలో వున్న అహార నియమాలు ఇప్పుడు లేవు.అప్పుడు పెద్దలు ఏది తినాలన్నా ఇష్టంగా తినేవాళ్ళు. ఇప్పుడు ఉన్న జనాలకు ఏదైనా తినాలంటే రుచి కన్నా ముందు కలర్ ఫుల్ గా వుండాలి. అప్పుడే ఇష్టంగా తింటారు.అప్పటి స్వీట్స్ కు ఎంతో ప్రత్యేకత ఉంది.వంటల్లో అనేక ఆరోగ్య రహస్యాలు దాగున్నాయి..అలాంటి వాటిలో ఒకటి నువ్వుల లడ్డు..ఈ లడ్డు తయారీ ఎలానో ఇప్పుడు తెలుసుకుందాం..
కావాలిసినవి..
తెల్ల నువ్వులు -ఒక కప్పు
బాదాం పలుకులు – కొన్ని ముక్కలు చేసినవి
బెల్లం -తీపికి సరిపడా
నెయ్యి -రెండు స్పూన్లు
తయారీ విధానం..
ముందుగా స్టౌ మీద పాన్ పెట్టి… నువ్వులను స్విమ్ లో పెట్టి వేయించాలి. నువ్వులు చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకుని పౌడర్ చేసుకోవాలి. తర్వాత పాన్ లో తురిమిన బెల్లాన్ని వేసుకుని నీరు పోసి.. తీగ పాకం వచ్చే వరకూ బెల్లాన్ని మరిగించి.. దానిలో నువ్వుల పొడి.. బాదాం పలుకులు వేసుకోవాలి. ఈ మిశ్రమం బాగా కలిసి.. ఉండలు వచ్చేలా అయ్యాక స్టౌ మీద నుంచి దింపేసుకోవాలి.వేడిగా ఉన్నప్పుడే లడ్డూలు చేసుకోవాలి.అంతే లడ్డు రెడీ..ఎన్నో పొషకాలు ఉన్న ఈ లడ్డును రోజు ఒకటి తింటే.. రక్తహీనత, కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, అలసట, నీరసం వంటివి ఏమీ ఉండవు..మీరు కూడా ట్రై చేయండి..