పచ్చి బొప్పాయి తో చక్కటి ఆరోగ్యం..

manaarogyam

బొప్పాయి ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుంది అనేది ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు.. పొషకాల ఘని..కేవలం పండు తోనే కాదు.. పచ్చి కాయలను రకరకాలుగా వాడుతుంటారు.. ఇవి పాలిచ్చే తల్లులకు చాలా మంచిది. కొంతమంది ఈ కాయలను అలానే తినడానికి ఇష్టపడరు..అలాంటి వాళ్ళు ఇలా రొట్టె చేసుకొని తింటే రుచి తో పాటు ఆరోగ్యం కూడా బాగుంటుంది.. మరి ఆలస్యం ఎందుకు ఎలా చేయాలో పూర్తి వివరాలను తెలుసుకుందాం..

కావలసినవి..

వరి పిండి- రెండు కప్పులు,
రవ్వ – పావు కప్పు,
పచ్చి బొప్పాయి తురుము- కప్పు,
ఉల్లి ముక్కలు- అర కప్పు,
క్యారెట్‌ తురుము- అర కప్పు,
పచ్చి మిర్చి ముక్కలు- స్పూను,
కరివేపాకు- రెండు రెబ్బలు,
కొత్తిమీర తరుగు- రెండు స్పూన్లు,
అల్లం పేస్టు- అర స్పూను,
జీలకర్ర- స్పూను,
నూనె- తగినంత
ఉప్పు-సరిపడా

తయారీ విధానం..

ముందుగా ఒక గిన్నెలో వరి పిండి, రవ్వ, పచ్చి బొప్పాయి తురుము, ఉల్లి, క్యారెట్‌, మిర్చి, కరివేపాకు, కొత్తిమీర, అల్లం పేస్టు, జీలకర్ర, ఉప్పును వేసి బాగా కలపాలి. నీటిని చేర్చి ముద్దలా కలుపుకోవాలి.కొద్దిగా పిండి ని తీసుకొని రొట్టి లాగా చేసుకోవాలి.. పెనం పై వేసి నూనె వేస్తూ కాల్చుకోవాలి.. అంతే రుచికరమైన పచ్చి బొప్పాయి రొట్టె రెడీ.. పిల్లలు ఇలా చేస్తే ఇష్టంగా తింటారు.. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చెయ్యండి.

Leave a Comment